Begin typing your search above and press return to search.

కాస్త ఓపిక ప‌ట్టేందుకు సిద్ధ‌మైన ట్రంప్

By:  Tupaki Desk   |   1 April 2017 5:53 AM GMT
కాస్త ఓపిక ప‌ట్టేందుకు సిద్ధ‌మైన ట్రంప్
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త ఓపిక‌గా వ్య‌వ‌హ‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు. దూకుడు నిర్ణ‌యాల‌కు పెట్టింది పేర‌యిన ట్రంప్ త‌న స‌హ‌జ‌శైలిని ఎందుకు మార్చుకోవాల‌నుకుంటున్నారు అనేదే క‌దా మీ సందేహం? ట‌్రంప్ కాస్త మారే ఆలోచ‌న‌ కూడా ఆయ‌న ఎత్తుగ‌డ‌లో భాగ‌మే. ఇది ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన హెల్త్ కేర్ పాల‌సీ గురింది. దేశ ప్ర‌జ‌ల‌ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలో మార్పులను కొంతకాలం వరకు తీసుకురాకూడదని అధ్యక్షుడు ట్రంప్‌ భావిస్తున్నారు. గత వారంలో దీనికి సంబంధించి చట్టం తీసుకురావడంలో ప్రభుత్వం విఫలం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఒబామా ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరోగ్య సంరక్షణా చట్టాన్ని రద్దు చేసి ఆ స్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని ట్రంప్‌ భావించారు. ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్‌ ఈ అంశాన్ని పలుసార్లు ప్రస్తావించారు. అనేక కారణాల రీత్యా ఈ బిల్లుకు సొంత పార్టీ నుండే తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. పాలసీదారులకు తీవ్ర వ్యయం కావడం, పైగా ఈ పాలసీని తీసుకోకపోతే పెద్ద మొత్తంలో జరిమానాలు విధించడం వంటివి వ్యతిరేకతకు కారణమయ్యాయి. దీంతో కనీసం కొంత కాలం పాటు ఈ అంశాన్ని చర్చకు చేపట్టరాదని నిపుణులు కొంతమంది సూచించారు. సమీప భవిష్యత్తులో పన్ను సంస్కరణలు, మౌలిక సదుపాయాల రంగ పెట్టుబడులు వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్‌ విధానాల అధ్యయన కేంద్రం డైరెక్టర్‌ డాన్‌ మహాఫీ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 2018 తర్వాతనే ఈ బిల్లును తీసుకురావాలని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/