Begin typing your search above and press return to search.
పిలవని పెళ్లికి వెళ్లి షాకిచ్చిన ట్రంప్
By: Tupaki Desk | 12 Jun 2017 10:27 AM GMTఅమెరికా అధ్యక్షుడంటే మాటలా? ఆయన వస్తున్నారంటే దేశ దేశాలే అలెర్ట్ అయిపోతుంటాయి. ఆయన ఎక్కడికైనా వెళుతుంటే.. వారాల ముందు నుంచే భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తుంటారు. ఇక.. ఆయన రావటానికి రోజు ముందు నుంచి ఆ ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసేసుకుంటారు భద్రతా సిబ్బంది. అలాంటి సెక్యురిటీ అమెరికా అధ్యక్షుడి సొంతం.
అయితే.. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన ట్రంప్ తీరు కాస్త భిన్నం. ఆయన వెళ్లే దారిలో ఏదైనా పెళ్లి వేడుక కనిపిస్తే చాలు.. అప్పటికప్పుడు అక్కడ ఆగి.. ఆ వేడుకకు వెళ్లి మరీ హడావుడి చేస్తారు. పెళ్లికి పిలిచినా.. పిలవకున్నా ఇంత హడావుడి చేయటం ట్రంప్‌కు చాలా సరదా. తాజాగా అలాంటి పనే చేసి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించారు. పిలవని పెళ్లికి ముందస్తు సమాచారం లేకుండా హాజరైన ఆయన తీరు సంచలనంగా మారింది.
న్యూజెర్సీలోని నేషనల్ గోల్ఫ్ క్లబ్ నుంచి తిరిగి వెళుతున్న ట్రంప్.. అక్కడ జరుగుతున్న పెళ్లి రిసెప్షన్ కు వెళ్లాలనిపించినట్లుంది. వెంటనే.. ఏమాత్రం ఆలోచించకుండా ఆయన పెళ్లి వేడుక్కి వెళ్లేందుకు రెఢీ అయ్యారు. కేవలం నిమిషాల వ్యవధిలో పెళ్లి రిసెప్షన్ కు హాజరై అక్కడి వారందరికి షాక్ లాంటి అనుభవాన్ని మిగిల్చారు. ట్రంప్ పుణ్యమా అని వేడుక మొత్తం ట్రంప్ హైలెట్ అయ్యారు. చివరకు పెళ్లి కుమార్తె సైతం.. పెళ్లి కొడుకును వదిలేసి.. ఆయన దగ్గరకు వచ్చి సాదరంగా ఆహ్వానించింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. పిలవని పెళ్లి రిసెప్షన్‌కు వెళ్లిన ట్రంప్.. వధూవరుల పేర్లను అడిగి తెలుసుకొని మరీ వారిని దీవించారు. అనంతరం మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ టోపీలపై సంతకం చేశారు. స్వయంగా అమెరికా అధ్యక్షుల వారే వేడుకకు రావటంతో వేడుకకు వచ్చిన వారి నోట మాట రాని పరిస్థితి. ట్రంప్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న వారు.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు.. ఫోటోలు తీసుకునేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించారట. ఇదే తీరులో ట్రంప్ గతంలోనూ వ్యవహరించారు. ఫిబ్రవరిలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌కు ఎలాంటి సమాచారం లేకుండా వెళ్లి అక్కడి వారికి స్వీట్ షాక్ ఇచ్చారు. ఊహించని రీతిలో తమ వేడుకకు ఏకంగా అమెరికా అధ్యక్షుల వారే రావటంపై వధూవరులిద్దరూ మాత్రం తెగ ఖుషీ అయిపోయారు. అందుకే కదా.. అధ్యక్షుల వారి స్థానంలో ఉన్న ట్రంప్.. సాదాసీదాగా పెళ్లి వేడుకకు వెళ్లింది మరి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/