Begin typing your search above and press return to search.
ట్రంప్ న్యూడ్ విగ్రహం కలకలం!
By: Tupaki Desk | 19 Aug 2016 6:12 AM GMTతనదైన శైలి మాటలతో.. మిత్రులు - శత్రువులూ అనే తారతమ్యాలు పెద్దగా లేకుండా సంధించే తనమార్కు వాగ్భాణాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు డోనాల్డ్ ట్రంప్. అంతకముందు ఎవ్వరికీపెద్దగా పరిచయం లేని ట్రంప్.. అమెరికా అధ్యక్షుడి రేసులోకి వచ్చేసరికి ప్రపంచం మొత్తానికి తెలిసిపోయారు. తన మాటలతో ప్రపంచం మొత్తాని కదిలించే కార్యక్రమాలు సైతం తలపెట్టిన ట్రంప్ - తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పై తనదైన శైలిలో నిప్పులు చెరుగుతూ హాట్ టాపిక్ అయ్యేవారు. ఈ రేంజ్ లో సాగుతున్న ట్రంప్ కి సంబందించిన ఒక విగ్రహం తాజాగా న్యూయార్క్ లో వెలిసింది. ఇది మామూలు విగ్రహం అయితే అది పెద్ద విషయం కాకపోయి ఉండేదోమో కానీ.. ఇది నగ్న విగ్రహం అయ్యేటప్పటికి ప్రపంచం మొత్తం హాట్ టాపిక్ అయ్యింది.
అవును... రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ నగ్న విగ్రహం ఒకటి న్యూయార్క్‌లో కలకలం రేపింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారట. ఉన్నట్లుండి ట్రంప్ నగ్న విగ్రహాన్ని చూసిన జనంలో కొంతమంది బిత్తరపోతే.. కొందరు మాత్రం ఎప్పటిలాగే ఫోన్లు చేతపట్టి ఆ న్యూడ్ విగ్రహంతో సెల్ఫీలు తీసుకునే పనిలో పడ్డారు. అనంతరం సోషల్ నెట్ వర్క్స్ లో షేర్ చేసే ఉంటారనుకోండి. న్యూయార్క్ నగరంలోని సిటీ స్క్వేర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఉదయాన్నే ఆ మార్గం గుండా వెళ్తున్న వారు ముందుగా చూసి, అధికారులకు సమాచారం అందించారట. బెల్లీ ఫ్యాట్ - ఎల్లో హెయిర్ తో ఈ విగ్రహం ఉంది. కాగా... తన వెబ్‌సైట్‌లో ట్రంప్ విగ్రహ తయారీకి సంబంధించిన వీడియోను ఉంచింది కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ. అయితే ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్న అధికారులు ఆ విగ్రహాన్ని వెంటనే తొలగించారు.