Begin typing your search above and press return to search.

ట్రంప్ వాత‌: ప‌్రోగ్రామ‌రా.. ఆ వీసా ఇవ్వ‌రు

By:  Tupaki Desk   |   5 April 2017 5:32 AM GMT
ట్రంప్ వాత‌: ప‌్రోగ్రామ‌రా.. ఆ వీసా ఇవ్వ‌రు
X
మ‌న ఐటీవాళ్ల‌కు పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చి ప‌డింది. అమెరిక‌న్ల ప్ర‌యోజ‌న‌మే త‌న ప్ర‌ధ‌మ క‌ర్త‌వ్య‌మ‌ని చెప్పుకునే అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ పుణ్య‌మా అని ఇప్పుడు ఇండియ‌న్స్‌కు భారీ షాక్ త‌గిలే నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. అమెరికాకు వెళ్లే ఐటీ నిపుణుల్లో ఎక్కువ మంది వెళ్లే హెచ్‌1బీ వీసాకు దెబ్బేస్తూ తాజాగా రూపొందించిన మార్గ‌ద‌ర్శ‌కాలు గుదిబండ‌గా మార‌నున్నాయి. హెచ్‌1బీ వ‌ర్క్ వీసాల కోసం అప్లై చేసే వేలాది భార‌తీయుల మీద ప్ర‌భావం చూపేలా ట్రంప్ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకున్నారు. ఎంట్రీ లెవెల్ కంప్యూట‌ర్ ప్రోగ్రామ‌ర్‌ను ప్ర‌త్యేక వృత్తినిపుణుడిగా ప‌రిగ‌ణించ‌బోమంటూ ప్ర‌క‌టించారు. ఇక‌పై ఈ వీసాలు పొందాలంటే ప్ర‌త్యేక వృత్తుల్లో నిపుణులై ఉండాలి.

దాదాపు 17 ఏళ్ల క్రితం అమెరికా జారీ చేసిన మ‌ర్గ‌ద‌ర్శ‌కాల‌కు పూర్తి విరుద్ధ‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల్ని తాజాగా రూపొందించారు. మార్చి 31న జారీ చేసిన స‌రికొత్త మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. అక్టోబ‌రు 1 నుంచి మొద‌ల‌య్యే కొత్త ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన హెచ్‌1బీ వీసాల మంజూరుకు సోమ‌వారం నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ షురూ అయ్యింది. స‌రిగ్గా ఈ ప్ర‌క్రియ స్టార్ట్ కావ‌టానికి మూడు రోజుల ముందు విడుద‌ల చేసిన కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల చిట్టా చ‌దువుతున్న కొద్దీ మ‌నోళ్ల గుండెలు బరువెక్కిపోయే పరిస్థితి. ఒక కంప్యూట‌ర్ ప్రోగ్రామ‌ర్ ఐటీలో త‌న నైపుణ్యాల‌ను వినియోగిస్తే సంస్థ ల‌క్ష్యాల్ని అధిగ‌మించ‌టంలో త‌న వంతు పాత్ర పోషిస్తున్నా.. ఆ ఉద్యోగి ప్ర‌త్యేక వృత్తి కింద‌కు రార‌ని.. కంప్యూట‌ర్ ప్రోగ్రామ‌ర్ ప్ర‌త్యేక వృత్తి అని చెప్పే ఆధారాల్ని హెచ్‌1బీ వ‌ర్క్ వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేసే ద‌ర‌ఖాస్తుదారుడు చూపించాల్సి ఉంటుంది.

తాజాగా విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌తో పాటు.. గ‌ట్టి హెచ్చ‌రిక‌నే ట్రంప్ స‌ర్కారు చేసింది. హెచ్‌1బీ వ‌ర్క్ వీసాల దుర్వినియోగంపై అమెరికాలోని కంపెనీల‌కు వార్నింగ్ ఇచ్చిన స‌ర్కారు.. త‌ప్పు చేస్తే స‌హించ‌బోమ‌ని.. అమెరిక‌న్ల ప‌ట్ల వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తే కంపెనీల‌పై ద‌ర్యాప్తు జ‌ర‌ప‌టంతో పాటు.. బాధ్యుల్ని ప్రాసిక్యూట్ చేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చేసింది.

అంతేకాదు.. దేశంలో అత్యుత్త‌మ నైపుణ్యాలున్న ఉద్యోగుల కొర‌త ఉంటేనే కంపెనీలు విదేశీయుల‌ను రిక్రూట్ చేసుకునేందుకు హెచ్‌1బీ వీసాల్ని ఉప‌యోగించుకోవాల‌ని చెప్పింది. ఉద్యోగాల‌కు కావాల్సిన అర్హ‌త‌.. ఆస‌క్తి ఉన్నా.. చాలామంది అమెరిక‌న్ల‌కు దేశంలోని కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వ‌టం లేద‌ని.. వీసా విధానంలో మోసాల్ని అడ్డుకోవ‌టం.. వారి ప్ర‌యోజ‌నాల్ని కాపాడ‌ట‌మే ల‌క్ష్యంగా పేర్కొంది. తాజాగా విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాలు.. చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు చూసిన‌ప్పుడు హెచ్1బీ వీసాల కోసం అప్లై చేసేందుకు ఉన్న అవ‌కాశాలన్నింటిని వీలైనంత‌వ‌ర‌కూ త‌గ్గించే ల‌క్ష్యం క‌నిపిస్తుంది. హెచ్‌1బీ వీసాల‌పై ప‌రిమితులు విధించ‌టం ద్వారా ఆ వీసాల కోసం ప్ర‌య‌త్నించే వారికి ముంద‌ర‌కాళ్ల బంధాల్ని వేసేలా ట్రంప్ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా కనిపిస్తుంది. అమెరికాలో ఉద్యోగానికి ఇంత‌కాలం అండ‌గా నిలిచిన హెచ్‌1బీ వీసా ఇప్పుడు గుదిబండ‌గా మార‌నుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తాజాగా రూపొందించిన మార్గ‌ద‌ర్శ‌కాల్ని ప‌క్కాగా అమ‌లు చేయ‌టంలో కృత‌నిశ్చ‌యంతో ఉన్నామ‌న్న విష‌యాన్ని ట్రంప్ స‌ర్కారు తేల్చి చెప్ప‌ట‌మే కాదు.. మ‌రో పెద్ద మాట‌నే చెప్పేసింది. హెచ్‌1బీ వీసాలు జారీ చేసిన వారిని క్షేత్ర‌స్థాయిలో త‌నిఖీలు నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా పేర్కొంది. అదే జ‌రిగితే.. హెచ్‌1బీ వీసాల కోసం అప్లై చేయ‌టానికి కంపెనీలు భ‌య‌ప‌డే ప‌రిస్థితిని ట్రంప్ స‌ర్కారు తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/