Begin typing your search above and press return to search.

భార‌త్ మీద ట్రంప్ అంతులేని ద‌య‌!

By:  Tupaki Desk   |   7 Nov 2018 5:41 AM GMT
భార‌త్ మీద ట్రంప్ అంతులేని ద‌య‌!
X
అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ పేరు విన్నంత‌నే తిట్టి పోసే వారు ప్ర‌పంచ వ్యాప్తంగా బోలెడంత మంది క‌నిపిస్తారు. త‌న‌ను అంత మంది అంత‌లా అపార్థం చేసుకున్నా.. ఆయ‌న మాత్రం పెద్ద మ‌నసుతో భార‌త్‌ను తానెంత‌గా ఆదుకున్న విష‌యాన్ని చెప్పుకొచ్చారు. తన జాలి కార‌ణంగా ప్ర‌పంచ దేశాలు బ‌తికేస్తున్నాయే కానీ... లేకుంటే ఆగ‌మాగం అయిపోతాయ‌ని చెప్పుకొచ్చారు.

భార‌త్ తో పాటు మ‌రికొన్ని దేశాల మీద ట్రంప్ అపార‌మైన క‌రుణ‌ను ప్ర‌ద‌ర్శించాయ‌ని.. లేకుంటేనా చుక్క‌లు క‌నిపించేవంటూ చెప్పుకొచ్చారు. ఇంత‌కూ భార‌త్ కు ట్రంప్ చేసిన అంత పెద్ద మేలేంటి? అన్న‌ది చూస్తే.. ఇరాన్ ఎగుమ‌తి చేసే చ‌మురు మీద అమెరికా విధించిన ఆంక్ష‌ల్ని భార‌త్ తో స‌హా కొన్ని దేశాలపైనా ట్రంప్ సడ‌లించ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇరాన్ పై గుర్రుగా ఉన్న ట్రంప్.. ఆ దేశంపై ఆర్థిక దిగ్బంధ‌నాన్ని ప్ర‌యోగించారు. ఈ ఆంక్షలు అమ‌లైన ప‌క్షంలో భార‌త్ తో స‌హా ప‌లు దేశాల‌కు ఇబ్బందిక‌రంగా మారుతుంది. ఇలాంటివేళ‌.. అందుకు భిన్నంగా తాము విధించిన ఆంక్ష‌లను కొద్దిమేర మిన‌హాయించిన ట్రంప్ నిర్ణ‌యం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇంత‌కీ భార‌త్.. చైనాతో స‌హా కొన్ని దేశాల విష‌యంలో ట్రంప్ మిన‌హాయింపుల్ని ఎందుకు ఇచ్చారు? అన్న ప్ర‌శ్న వేస్తే.. ఆయ‌న ఆస‌క్తిక‌ర స‌మాధానాన్ని ఇస్తున్నారు.

ఇరాన్ పై అమ‌ల్లోకి వ‌చ్చిన ఆంక్ష‌ల తీవ్ర‌త‌లో ఎలాంటి మార్పు లేద‌న్న ఆయ‌న‌.. చ‌మురు రంగంపై ఆంక్ష‌ల్ని క‌ఠినం చేస్తే అంత‌ర్జాతీయంగా చ‌మురు ధ‌ర‌లు మండుతాయ‌న్నారు. అందుకే ఈ విష‌యం మీద ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా ఆయ‌న వెల్ల‌డించారు. ఆచితూచి అడుగులు వేయాల‌నుకోవ‌టం.. భార‌త్‌.. చైనా అవ‌స‌రాల దృష్ట్యా తాము కొన్ని ష‌ర‌తుల‌తో ఎగుమ‌తికి ఓకే చెబుతున్న‌ట్లుగా ట్రంప్ పేర్కొన్నారు.

తాను త‌లుచుకుంటే నిమిషాల వ్య‌వ‌ధిలోనే చ‌మురు పంపిణీని బంద్ చేస్తామ‌న్న ట్రంప్‌.. అలా చేసి తాను గ్రేట్ హీరో అనిపించుకోవాల‌ని లేద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

ఇరాన్ పై ఆంక్ష‌ల్ని మ‌రింత క‌ఠిన‌త‌రం చేస్తే.. మార్కెట్లు కుదేల‌వుతాయ‌ని.. దాని కార‌ణంగా కొత్త సంక్షోభాలు ఎదుర‌వుతాయ‌న్న ఉద్దేశంతో తానీ నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లుగా ట్రంప్ చెబుతున్నారు. ఉన్న‌ట్లుండి భార‌త్‌.. చైనాతో స‌హా ఎనిమిది దేశాల మీద ట్రంప్ కు ఇష్టం ఎందుకన్న క్వ‌శ్చ‌న్ రాక మాన‌దు. ఇదిలా ఉంటే.. ట్రంప్ నోటి నుంచి ష‌ర‌తుల మిన‌హాయింపు ప్ర‌క‌ట‌న వెల్ల‌డైన కాసేప‌టికే ఇరాన్‌.. త‌న బ‌ల‌గాల్ని ప్ర‌ద‌ర్శిస్తూ ఆయుధ ప‌రీక్ష‌కు దిగిన‌ట్లుగా స్థానిక మీడియా చెబుతోంది. మ‌రీ వ్య‌వ‌హారం ఎక్క‌డివ‌ర‌కూ వెళుతుందో చూడాలి.