Begin typing your search above and press return to search.

ఉగ్రవాదం - పాకిస్తాన్.. ట్రంప్ ఏమన్నాడంటే?

By:  Tupaki Desk   |   24 Feb 2020 10:50 AM GMT
ఉగ్రవాదం - పాకిస్తాన్.. ట్రంప్ ఏమన్నాడంటే?
X
భారత గడ్డపై కాలుమోపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ప్రసంగంతో అదరగొట్టారు. అహ్మదాబాద్లోని మోతేరా స్టేడియంలో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో ఉగ్రవాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ తో కలిసి పనిచేస్తామని ట్రంప్ తెలిపారు. ఏ రూపంలో ఉగ్రవాదాన్ని సహింబోమని స్పష్టం చేశారు. ఉగ్రవాద ముప్పునుంచి కాపాడేందుకు భారత్ తో కలిసి చర్యలు చేపడుతామన్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులను ఏరేశామని.. దాని చీఫ్ బాగ్దాదీని అమెరికన్ సైనికులు చంపేశారని ట్రంప్ చెప్పుకొచ్చాడు.

ఇక ఇండియాతోనే కాదు.. పాకిస్తాన్ తోనూ ఉగ్రవాద నిర్మూలనలో కలిసి పనిచేస్తామని ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తో అమెరికాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ఆ చనువుతోనే సరిహద్దుల్లో మొన్న భారత్ తో ఉద్రిక్తతలు తగ్గించామని ట్రంప్ తెలిపారు. దీన్ని పరోక్షంగా పాకిస్తాన్ కు తమ మద్దతు ఉందని ట్రంప్ చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.

అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ గురించి భారత్ గడ్డపై ట్రంప్ వ్యతిరేకంగా మాట్లాడకపోవడం సంచలనంగా మారింది. పాకిస్తాన్ తోనూ ఉగ్రవాద నిర్మూలనకు పాటు పడుతామని అనడం ప్రాధాన్యత సంతరించుకుంది.