Begin typing your search above and press return to search.

ట్రంప్ నిర్ణ‌యంతో హైద‌రాబాద్‌ కు పెద్ద‌ దెబ్బ‌

By:  Tupaki Desk   |   12 March 2017 11:00 AM GMT
ట్రంప్ నిర్ణ‌యంతో హైద‌రాబాద్‌ కు పెద్ద‌ దెబ్బ‌
X
అమెరికా ఉద్యోగాల ఔట్‌ సోర్సింగ్‌ కు అడ్డుకట్ట వేసేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన బిల్లు భారతీయుల్లో కలకలం రేపుతోంది. ఈ బిల్లు పాసైతే భారత ఐటీ రంగ ముఖచిత్రం సమూలంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇందులో ముఖ్యంగా హైద‌రాబాద్‌ కు భారీ ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని అంటున్నారు. నిజానికి భారత ఐటీ ఎగుమతులు.. అమెరికా మీదనే ఎక్కువగా ఆధారపడి జరుగుతున్నాయి. మన ఎగుమతుల్లో దాదాపు 60 శాతం అక్కడికే. ఇక, ఔట్‌ సోర్సింగ్‌ పరంగా అంతర్జాతీయంగా 55 శాతం వాటా మనదే అని నాస్కామ్‌ స్పష్టం చేస్తోంది. ఐటీ ఎగుమతుల పరంగా దేశంలోనే హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. వృద్ధి రేటు పరంగా అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్‌ కు ఎన్నో దిగ్గజ కంపెనీలు వస్తూనే ఉన్నాయి. వాటిలో అత్యధికం.. ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీలే. హైదరాబాద్‌ లో దాదాపు 5 వేలకు పైగా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు ఉన్నాయి. భారతీయ సాఫ్ట్‌ వేర్‌ ఎగుమతులు 110 బిలియన్‌ డాలర్లు ఉంటే.. ఒక్క హైదరాబాద్‌ నుంచి 87 వేల కోట్ల రూపాయల ఎగుమతులు ఐటీ, ఐటీఈఎస్‌ పరంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ అంచనాలన్నీ తలకిందులయ్యే ప్రమాదం పొంచి ఉందనేది ఖాయ‌మ‌ని అంటున్నారు.

అదే స‌మ‌యంలో ఔట్‌ సోర్సింగ్‌ బిల్లు పాసైతే భారత్‌ కు జరిగేది ఆర్థిక నష్టమే కాక, దానివల్ల వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతారు. ట్రంప్‌ చెప్పినట్లుగా అన్నీ చేస్తే.. అంటే హెచ్‌1బీ వీసాలను ఆపేయడం, ఔట్‌ సోర్సింగ్‌ పై కొరడా ఝుళిపించడం, అమెరికన్లకే తొలి ప్రాధాన్యం వంటివాటిని అమలు చేస్తే ఇండియాలో 25 లక్షల మంది ఉద్యోగులపై ప్రత్యక్షంగా.. 2కోట్ల మందిపై పరోక్షంగా ప్రభావం పడుతుందని ఐటీ రంగ నిపుణులు అంచనా.అమెరికాలో అమల్లోకి రానున్న కఠిన నిబంధనలు, ఫీజుల పెంపు వంటివి కంపెనీలకు తలకు మించిన భారం కాబోతున్నాయి. ఈ నిబంధనలు తమ మార్జిన్స్‌ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఇప్పటికే ఇన్ఫోసిస్‌లాంటి కంపెనీలు భావిస్తున్నాయి. దీనివల్ల కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి. కేవలం అమెరికా మీద మాత్రమే ఆధారపడకుండా ఇతర దేశాలలో కూడా మనకున్న అవకాశాలను వెతకాల్సిన ఆవశ్యకత ఉందని అంటున్నారు.

ఆఫ్‌ షోరింగ్‌, ఔట్‌ సోర్సింగ్‌ అనేది అమెరికన్‌ డీఎన్‌ ఏలో భాగం. ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా పని చేయించుకునే అమెరికా కంపెనీలపై ఆదాయపరంగా తక్షణ ప్రభావం కనిపిస్తుంది. అమెరికన్‌ కంపెనీలు తమ వర్క్‌ ను ఇండియాకు ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నాయి. అమెరికన్‌ కంపెనీలు తమ వర్క్‌ ను ఇండియాకు ఔట్‌ సోర్సింగ్‌ కు ఇస్తున్నది ఖర్చు తగ్గుతుందనే కారణంతో కాదు, మనవాళ్ల టాలెంట్‌ను చూసే వస్తున్నాయి. కానీ ఈ అవసరాలను తీర్చే ప్రతిభావంతులు అమెరికాలో దొరకడం కష్టమే. ఈ డిమాండ్‌ తీర్చడానికి మరలా విదేశీయులను ఆహ్వానించాల్సిందే అన్నది అక్కడి నిపుణుల మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/