Begin typing your search above and press return to search.
ఇండో అమెరికన్ పై ట్రంప్ ఆగ్రహం
By: Tupaki Desk | 14 Nov 2018 11:16 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష భవనంలో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. భారత సంతతి వారికోసం వైట్ హౌస్ లో ఈ మేరకు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఇండో అమెరికన్ అజిత్ పాయ్ ను టార్గెట్ చేసి ట్రంప్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
అజిత్ పాయ్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో అమెరికన్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్( ఎఫ్ సీసీ) చైర్మన్ గా నియామకమయ్యారు. ట్రంప్ వచ్చాక ఎఫ్ సీసీ చీఫ్ గా అజిత్ పాయ్ నే కొనసాగించారు. కానీ గడిచిన జూలైలో ట్రంప్ ట్రిబ్యూన్ మీడియాను నిన్ క్లెయిర్ బ్రాడ్ కాస్ట్ గ్రూప్ టేకోవర్ చేయడానికి అనుమతి ఇవ్వగా.. అజిత్ పాయ్ నేతృత్వంలోని ఎఫ్ సీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీన్ని మనసులో పెట్టుకున్న ట్రంప్ దీపావళి వేడుకలకు వచ్చిన అజిత్ పాయ్ ను ఏకంగా పేరు పెట్టి పిలిచీ మరీ అవమానించాడు. అజిత్ నిర్ణయం తనకు ఎంతమాత్రం నచ్చలేదని.. ఆయన నిర్ణయం అసలు నచ్చకపోయినా ఆయనకు ఆ స్వతంత్రత ఉందని అందరి సమక్షంలో వ్యాఖ్యానించారు.
అయితే తన నిర్ణయంపై అజిత్ పాయ్ మాత్రం సమర్ధించుకున్నారు.. ఫేక్ న్యూస్ ప్రసారం చేసిన టీవీ చానెళ్ల లైసెన్సుల పునరుద్ధరణపై ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా పాయ్ పనిచేశానని చేస్తానని చెప్పుకొచ్చారు.