Begin typing your search above and press return to search.
భారత్ కు అమెరికా కరోనా సాయం..ట్రంప్ ప్లాన్ ఇదేనా?
By: Tupaki Desk | 7 April 2020 2:30 AM GMTప్రపంచంలోనే పెద్దన్న ముద్ర అమెరికా సొంతం. వేదిక ఏదైనా - సందర్భం ఏదైనా కూడా అమెరికా వ్యవహార సరళి ఇలాగే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నది మనకు తెలిసిందే. అయితే కరోనాతో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా అత్యంత ప్రభావితం అయిన ప్రస్తుత తరుణంలోనూ అమెరికా ఈ భావన నుంచి బయటపడేందుకు అస్సలు ఒప్పుకోవడం లేదు. ఇక ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ అయితే.. అమెరికాకు ఉన్న ఈ ముద్రను కొనసాగించేందుకు నానా తంటాలు పడుతున్నారు. అందులో భాగంగా కరోనా వేళ.. తాము చితికిపోయినా... తన పెద్దన్న ముద్రను కాపాడుకునే క్రమంలో ఏకంగా భారత్ కు భారీ సాయం చేస్తూ సంచలన ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా ఈ సాయంతో పాటు గడచిన కొంతకాలంగా భారత్ కు అమెరికా ఏ రకంగా సాయపడుతోందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ మరీ కొత్త సాయాన్ని ప్రకటించడం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇందులో భాగంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు.. భారత్‌కు అమెరికా ఇప్పుడు భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రస్తుతం భారతదేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఇండియాలో 4 వేల కరోనా కేసులు నమోదు కాగా.. 109 మంది మరణించారు. ఇప్పటికే ఈ కరోనాను అడ్డుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రకరకాల చర్యలు చేపడుతూనే ఉన్నారు. నిజానికి కరోనా కేసులు అధికమైతే.. కట్టడి చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అటు ఆర్థికంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ మన దగ్గర అంత శక్తి లేదు. అందుకే ప్రధాని ఇలా లాక్‌డౌన్ విధించారు. ఈ క్రమంలో అమెరికా... భారత్ కు భారీ ఆర్థిక సాయం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొత్త సాయంతో పాటు 20 ఏళ్లుగా చేస్తున్న సాయాన్ని ప్రస్తావించిన అమెరికా.. ఈ సాయంలో మెజారిటీ సాయాన్ని ఆరోగ్య రంగానికే అందించామని కూడా ఆ దేశం చేసిన ప్రకటన నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇక భారత్ కు అమెరికా యూఎస్ ఏఐడీ ద్వారా 2.9 మిలియన్ డాలర్లను ఇవ్వనుంది. ఈ విషయాన్ని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ వెల్లడించారు. ప్రాణాంతక వైరస్ నియంత్రణకు ఈ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కరోనాపై పోరులో యూఎస్ ఏఐడీ - వ్యాధి నివారణ - నియంత్రణ కేంద్రం - ఇతర సంస్థలు భారత్ తో కలిసి పనిచేస్తాయని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ప్రపంచానికి పెను ముప్పులా మారిందని - అన్ని అంతర్జాతీయ ప్రభుత్వాలూ కలిసి కట్టుగా పనిచేస్తేనే ఈ విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా గడిచిన 20 ఏళ్లలో భారత్ కు అమెరికా మొత్తం 300 కోట్ల డాలర్లు ఆర్థిక సాయం అందించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు జస్టర్. ఇందులో 140 కోట్ల డాలర్లు ఆరోగ్య రంగానికి ఇచ్చినవేనని పేర్కొన్నారు.