Begin typing your search above and press return to search.
పుతిన్ ను మళ్లీ ప్రశంసించిన ట్రంప్
By: Tupaki Desk | 31 Dec 2016 5:30 PM GMTకాబోయే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై మరోమారు ప్రశంసలు కురిపించారు. హ్యాకింగ్ అరోపణలపై 35 మంది రష్యా దౌత్యవేత్తలను అమెరికా బహిష్కరించిన సంగతి తెలిసిందే. దీనికి బదులుగా అమెరికా దౌత్య వేత్తలను వెలివేయాలని రష్యా విదేశాంగశాఖ భావించినా, ఆ చర్యను పుతిన్ అడ్డుకున్నారు. ఈ అంశంలో పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ స్వాగతించారు. అమెరికా చర్యకు ప్రతిచర్యను పుతిన్ వాయిదా వేయడం గొప్ప ఎత్తుగడ అని, అతను చాలా స్మార్ట్ అన్న విషయం తనకు తెలుసు అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా హ్యాకింగ్ కు పాల్పడిందన్న ఆరోపణలపై నిజానిజాలు తెలుసుకొనేందుకు వచ్చే వారం ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో భేటీ కావాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా మరికొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాల్సిన సమయమని తెలిపారు.
మరోవైపు అమెరికా నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం కాలం నాటి వైరాన్ని అమెరికా తిరిగి తెరపైకి తెచ్చిందని అందులో భాగంగానే . రష్యా హ్యాకింగ్ కు పాల్పడిందంటూ అమెరికాలోని రెండు రష్యన్ దౌత్య కార్యా లయాలను మూసివేసి, 35 మంది దౌత్య అధికారులను వెనక్కి పంపిందని అంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా రష్యా హ్యాకింగ్ కు పాల్పడిందనేది అమెరికా అభియోగం. దీనిని రష్యా వెంటనే ఖండించింది.అయినా, ఒబామా ప్రభుత్వం రష్యా దౌత్యాధికారులను దేశం నుంచి బహిష్కరించింది. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందిస్తూ, అమెరికా చేసిన తుంటరి పని తాను చేయబోనని అన్నారు. అమెరికా చర్యకు ప్రతిగా రష్యా నుంచి అమెరికన్ దౌత్యవేత్తలను బహిష్కరించే ఆలోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలాఉండగా అధ్యక్షుడు ఒబామా ఈ పరిణామంపై ప్రకటన చేస్తూ రష్యా చర్యల పట్ల అమెరికన్లందరూ అప్రమత్తం కావాలని సూచించారు. అమెరికా ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని రష్యా పలు సైబర్ కార్యకలాపాలు సాగించిందని, అమెరికా అధికారులపై రష్యా వేధింపు చర్యలకు పాల్పడిందని ఒబామా ఆరోపించారు. తాము పలుసార్లు బహిరంగంగా, ప్రైవేటుగా రష్యా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/