Begin typing your search above and press return to search.

ట్రంప్ ను వ్యతిరేకించే వారిపై ఎలాంటి కేసులంటే..

By:  Tupaki Desk   |   24 Jan 2017 6:05 AM GMT
ట్రంప్ ను వ్యతిరేకించే వారిపై ఎలాంటి కేసులంటే..
X
అసలే అమెరికా అధ్యక్ష పదవి.. ఆ కుర్చీలో ట్రంప్ లాంటి వ్యక్తి కూర్చుంటే చట్టం ఎంత కరకుగా తయారవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది అమెరికాలో. తాను ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అమెరికా వీధుల్లోకి వచ్చి లక్షలాది మంది నిరసనకారులు చేస్తున్న నిరసనలపై ట్రంప్ సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు.

ట్రంప్ ప్రమాణస్వీకారం అయిపోయిన తర్వాత.. ఆయన్ను అమెరికా అధ్యక్షుడిగా ఒప్పుకోమంటే ఒప్పుకోమంటూ లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకు రావటం.. నిరసనలకు దిగటం.. ఈ సందడిలో పెద్ద ఎత్తున అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవటంపై ట్రంప్ అసంతృప్తిగా ఉండటమేకాదు.. ఈ తరహా నిరసనలపై ఉక్కుపాదం మోపాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఆందోళనకారులు ఆందోళనలు చేయటానికి భయపడేలా చర్యలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. నిరసనకారులపై తీవ్రమైన అభియోగాల్నిమోపటంతోపాటు.. వారిని జైలుకు పంపాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రమాణస్వీకారం రోజున నిరసనకారుల్లో 230 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హింసాత్మక ఘటనలకు పాల్పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు. వీరిపై తీవ్రమైన అభియోగాలు మోపటంతోపాటు.. రూ.25వేల జరిమానా.. పదేళ్లు జైలుశిక్ష విధించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. చూస్తుంటే.. తనపై ఆందోళనలు చేసే వారిని పదేళ్లు బాహ్య ప్రపంచానికి దూరం చేసేలా ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్లు లేదు? ఈ సరికొత్త తరహా తీరుకు స్వేచ్ఛా పిపాసులైన అమెరికన్లు ఎలా రియాక్ట్ అవుతారో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/