Begin typing your search above and press return to search.
సంచలనం: హైదరాబాద్ లో ట్రంప్ రియల్ ఎస్టేట్ వెంచర్
By: Tupaki Desk | 14 Dec 2022 6:31 AM GMTఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ వ్యాపారవేత్త కూడా. అందుకే అమెరికా అధ్యక్షుడు అయ్యాక కూడా ఆయన అధ్యక్షుడికి ఇచ్చే వేతనాన్ని కూడా తీసుకోలేదు. రియల్ ఎస్టేట్స్, హోటల్స్ సహా వివిధ వ్యాపారాల్లో ట్రంప్ రాణిస్తున్నాడు. ఇక అమెరికాలోనే కాదు.. ఇప్పుడు ట్రంప్ చూపు తనకు ఎంతో మిత్రదేశమైన 'భారత్'పై పడింది.
డొనాల్డ్ ట్రంప్ నకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ 'ది ట్రంప్ ఆర్గనైజేషన్' వచ్చే ఏడాది హై-ఎండ్ లగ్జరీ ప్రాపర్టీలలో పెట్టుబడి పెట్టాలని చూస్తోంది. భారతదేశంలోని ఐదు నగరాలు ఈ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. ఐదు నగరాల్లో ఒకటి హైదరాబాద్ కావడం విశేషంగా చెప్పొచ్చు.
భారత ఉపఖండంలో ట్రంప్ బ్రాండ్‌ను పరిచయం చేసిన కల్పేష్ మెహతా ప్రమోట్ ఇప్పుడు ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళుతున్నారు. ఢిల్లీ ఆధారిత ట్రిబెకా డెవలపర్స్‌తో కలిసి ట్రంప్ కంపెనీ ప్రత్యేకమైన లైసెన్సింగ్ ఒప్పందాన్ని కలిగి ఉంది. ట్రంప్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సమక్షంలో కల్పేష్ ఈ పెట్టుబడులను అధికారికంగా ప్రకటించారు.
ట్రిబెకా డెవలపర్లు ట్రంప్‌కు చెందిన రూ. 2500 కోట్ల విలువైన లగ్జరీ ప్రాపర్టీలలో పెట్టుబడి పెట్టనున్నారు. బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పూణె, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లలో ఒక్కో ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ నగరాలతో పాటు చండీగఢ్ మరియు లూథియానాలో ప్రాజెక్టులు పరిశీలనలో ఉన్నాయి. 5000 కోట్ల విలువైన మొత్తం డజను ప్రాజెక్టులు ప్రతిపాదించబడ్డాయి. అయితే ప్రారంభ పెట్టుబడి పైన వీరిద్దరూ చర్చలు జరుపుతున్నారు.
ట్రంప్ టవర్లు ప్రస్తుతం పూణె, ముంబై, గుర్గావ్ మరియు కోల్‌కతాలో ఉన్నాయి. తాజా పెట్టుబడి ప్రతిపాదనతో, ట్రంప్ ఆర్గనైజేషన్ దక్షిణ భారతదేశంలోకి అడుగు పెడుతోంది. మన హైదరాబాద్ లోనూ ట్రంప్ రియల్ ఎస్టేట్ చేయనుండడం విశేషంగా మారింది.
వచ్చే 12 నెలల్లోనే 7-8 ప్రాజెక్టులపై రూ.5000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో 2500 కోట్లను ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రారంభించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై వెచ్చించనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.