Begin typing your search above and press return to search.
అబ్బా... ట్రంప్ కంపు తగ్గలేదు!
By: Tupaki Desk | 18 March 2017 9:30 AM GMTఅమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అయినా డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన మారుతుందని అంతా ఆశించారు. అయితే... అందరి అంచనాలను తలకిందులు చేస్తూ... ట్రంప్ తనదైన దురుసు బిహేవియర్ ను వీడేందుకు మాత్రం సంసిద్ధంగా లేరు. అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల సమయంలో ప్రచారంలో తనదైన నిజ నైజాన్ని బయటపెట్టుకున్న ట్రంప్... తన సొంత కుటుంబ సభ్యులపైనా డిరాగేటరీ కామెంట్లు చేసి యావత్తు ప్రపంచ దేశాలను నివ్వెరపరిచారు. తామంతా పెద్దన్నలా భావిస్తున్న అమెరికాకు ట్రంప్ లాంటి కంపు నేత అధ్యక్షుడు అయితే ఎలాగంటూ ప్రపంచ దేశాల అధినేతలంతా నాడు డైలమాలో పడిపోయిన వైనం కూడా మనకు తెలుసు.
అయితే అమెరికా ప్రజలేమో... ట్రంప్ ఎంత కంపు చేసినా ఆయనకే ఓటేసి గెలిపించారు. ప్రజల ఓట్లతో గెలిచిన ట్రంప్ ఆ తర్వాత దర్జాగా అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కేశారు. వైట్ హౌస్ లో కాలు పెట్టారు. ఆ తర్వాత ట్రంప్ ప్రవర్తనలో మార్పు తప్పనిసరిగా వస్తుందని అందరూ భావించారు. అయితే తనదైన నిజ నైజాన్ని వదులుకునేందుకు ట్రంప్ సిద్ధంగా లేరన్న దానిని నిదర్శనంగా ట్రంప్ వ్యవహార సరళి ఉంటోంది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా ప్రధానితో ఫోన్ లో మాట్లాడిన సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్... ఆసీస్ ప్రధానిని దిగ్భ్రాంతికి గురి చేశారు. సాధారణంగా రెండు దేశాల అధినేతలు మాట్లాడుకుంటే అందులో ప్రోటోకాల్ పాటించడం తప్పనిసరి. అయితే ఆ ప్రోటోకాల్ కు కూడా తిలోదకాలిచ్చిన ట్రంప్... ఫోన్ ను మధ్యలోనే కట్ చేసిన వైనం ప్రపంచాన్ని నివ్వెరపరచింది.
ఇక తాజా విషయానికి వస్తే... జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్ పట్ల కూడా ట్రంప్ ఏమాత్రం మర్యాదగా ప్రవర్తించలేదట. ఓ దేశానికి అధినేత్రిగా ఉన్న మెర్కెల్ పట్ల ట్రంప్ వికృతంగానే వ్యవహరించారట. ఈ ఘటన వివరాల్లోకెళితే... అమెరికా పర్యటనకు వచ్చిన సందర్భంగా ట్రంప్‌తో ఏంజెలా భేటీ అయ్యారు. ఓవల్ కార్యాలయంలో వారి భేటీ అనంతరం విలేకరులతో ఫొటో పోజ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రంప్ గతంలో అమెరికా పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని షింజో అబే - కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోలతో భేటీ అయిన సందర్భంగా వారితో కరచాలనం చేశారు. అయితే మెర్కెల్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ట్రంప్ వ్యవహరించారు.
మెర్కెల్ లో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆసక్తి చూపని ట్రంప్... షేక్ హ్యాండ్ కోసం మెర్కెల్ విజ్ఞప్తి చేసినా కూడా ట్రంప్ ఆమె వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదట. దీంతో బిత్తరపోయిన మెర్కెల్ అసలు ఏం చేయాలో పాలుపోక తికమక పడ్డారట. ప్రవాసులు - శరణార్థుల విషయంలో విభేదాల కారణంగానే ఏంజెలాతో ట్రంప్ అయిష్టంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె గురించి ఒక్క ప్రశంస కూడా చేయకపోగా.. ప్రవాసులు విషయంలో ఆమెకు ట్రంప్ క్లాస్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/