Begin typing your search above and press return to search.

భారత పర్యటనను మర్చిపోలేకపోతున్న ట్రంప్

By:  Tupaki Desk   |   1 March 2020 2:30 PM GMT
భారత పర్యటనను మర్చిపోలేకపోతున్న ట్రంప్
X
ఒక రాజకీయ నాయకుడికి ఏం కావాలి. కోట్ల మంది ప్రజాభిమానం కావాలి. అదే ఓట్ల వాన కురిపిస్తుంది. తన సభకు ఎంత మంది వస్తే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని భావిస్తాడు. భారత్ లో అయితే కోట్ల మంది ఉన్నారు. సభ పెడితే లక్షల్లో వస్తారు. అదే అగ్రరాజ్యం అమెరికాలో.. సంపద బాగా ఉండడంతో అమెరికాలో సభలు, సమావేశాలకు పెద్దగా జనాలు రారు. అందుకే భారత్ లో మొతేరా స్టేడియంలో 1.25 లక్షల మంది సమక్షంలో ప్రసంగించాక అమెరికాలో సభలను చూసి ట్రంప్ నిరాసక్తిగా ఉన్నాడట.. ఇప్పటికీ అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో 1.25లక్షల మంది సమక్షంలో చేసిన ప్రసంగాన్నే అద్భుతమని భావిస్తున్నాడు...

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో జరిగిన ఓ సభలో మాట్లాడారు. దీనికి 10-15వేల మంది మాత్రమే హాజరయ్యారు. వారిని చూసి ట్రంప్ తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. 150కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో అంతమంది జనాలు సభకు వచ్చినప్పుడు.. అంతకన్నా తక్కువ జనాభా కలిగిన అమెరికాలో ఇంతమంది సభకు రావడం గొప్ప విషయమేనని ట్రంప్ తన భారత పర్యటన అనుభవాలను గొప్పగా చెప్పుకొచ్చాడు. అమెరికా పట్ల భారత్ లో ఎంతో ఆదరణ ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ట్రంప్.. భారత్ లో జరిగిన సభ జ్ఞాపకాలను అందులో ప్రస్తావించి మోడీని కొనియాడారు. మోడీ భారత్ లో మంచి ఆకర్షనీయమైన, ఆదరణీయ వ్యక్తి అని ప్రజలు మెచ్చిన ప్రియతమ నాయకుడు అంటూ కొనియాడారు. భారత పర్యటన తనకు చాలా అనుభవాలను మిగిల్చిందని ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను మన ప్రధాని మోడీ అండ్ కో నెత్తిన పెట్టుకుంది. ట్రంప్ కు చేసిన ఏర్పాట్లు, స్వాగత సత్కారాలు అదిరిపోయాయి. ఒక చక్రవర్తిలాగా ట్రీట్ చేయడంతో ట్రంప్ ఫిదా అయిపోయాడు. అందుకే అమెరికా వెళ్లగానే ఇంకా భారత పర్యటన తాలూకా అతిథి సత్కారాలు, సన్మానాలు, గౌరవాన్ని మరిచిపోలేకపోతున్నాడు. ట్రంప్ కు భారీ సభలన్నా, పెద్ద గుంపును చూసి ప్రసంగించడం అన్నా మహా ఇష్టం. అయితే అమెరికాలో జనాలు పెద్దరాని సభల్లో ప్రసంగిస్తూ ఇలా భారత్ పై ప్రేమను చాటాడు.