Begin typing your search above and press return to search.

మనోడి హత్యను ట్రంప్ ఖండించాడు

By:  Tupaki Desk   |   1 March 2017 9:45 AM GMT
మనోడి హత్యను ట్రంప్ ఖండించాడు
X
తెంపరి ట్రంప్ మాట్లాడక తప్పలేదు. ఏ తప్పు చేయకుండా.. అన్యాయంగా.. జాత్యాంహకారంతో తెల్లోడు పేల్చిన విద్వేష తూటాపై ట్రంప్ రియాక్ట్ కాక తప్ప లేదు. కాన్సస్ లో తెలుగోడు శ్రీనివాస్ కూఛిబొట్లను కాల్చిచంపిన ఘటనపై అమెరికా నుంచి ఆంధ్రా వరకూ అందరూ ఖండించిన వారే. ఇలాంటి జాత్యాంహకార ఘటనలు సరికావన్న వారు మాత్రమే.

కానీ.. ఈ ఘటన మీద మాట్లాడంది.. నోరు విప్పంది.. కనీసం ఖండించంది ఎవరైనా ఉన్నారంటే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే. విశ్వ మానవాళికి వేదికగా ఉంటుందని చెప్పే నేల మీద జాత్యాంహకారం తలకెక్కటమే కాదు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు అమెరికన్ల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీనివాస్ కూఛిబొట్లను కాల్చి చంపిన వైనంపై తెరపైకి వచ్చింది.

ఈ ఘటన ట్రంప్ పాలనపై తీవ్ర విమర్శలకు దారి తీయటమే కాదు.. జాత్యాంహకార దాడులపై ట్రంప్ మాట్లాడాలని.. ఆయన తన వైఖరిని స్పష్టం చేయాలన్న డిమాండ్ వచ్చింది. అయినప్పటికీ.. ఈ విషయం మీదట్రంప్ మాట్లాడింది లేదు. వివక్షతో జరిగిన దాడిపై అమెరికా అధ్యక్షుడు స్పందించాలంటూ.. ఆయనపై పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ సైతం గళం విప్పారు.

ఇలా.. అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలకు ట్రంప్ తలొగ్గక తప్పలేదు. తాజాగా ఆయన.. శ్రీనివాస్ కూఛిబొట్ల కాల్చివేతఘటనను ఖండించారు. జాతి వివక్షను తాము అంగీకరించమని.. దాడుల్ని తాము ఖండిస్తామని ఆయన స్పష్టం చేశారు. విద్వేషాలను అందరూ ఖండించాలని.. అమెరికాలో విద్వేషాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. శ్రీనివాస్ కూఛిబొట్ల కాల్చివేత ఘటనను ఖండించిన ట్రంప్.. ఎప్పటిలానే అమెరికా మెక్సికో మధ్య గోడను కట్టి తీరతామని.. అమెరికన్లకు ఉద్యోగాల కోసం తాము పని చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా తామిచ్చిన హామీల్ని నెరవేరుస్తామన్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలతో అమెరికన్లకే లాభమని.. ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/