Begin typing your search above and press return to search.
అధ్యక్షుడి సెక్సీ స్టోరీలు..సీరియల్స్ లా కొనసాగుతున్నాయి!
By: Tupaki Desk | 22 Jun 2019 4:53 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సెక్సువల్ వేధింపుల ఆరోపణల పరంపర కొనసాగుతూ ఉన్నాయి. అమెరికాకు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించకముందు పెద్ద వ్యాపారి, రియలెస్టేట్ టైకూన్ గా వ్యవహరించిన డొనాల్డ్ ట్రంప్ పై అనేక మంది మగువలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ ను అలాంటి ఆరోపణలు ఏమీ చేయలేకపోగా.. ఆయనకు ఒక శృంగార పురుషుడు అనే ఇమేజ్ ను తీసుకొచ్చాయి. ఈ క్రమంలో మరో మహిళ ఆయనపై ఆరోపణలు చేసింది.
జీన్ కారోల్ అనే ఆమె వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు! అలాంటి ఆమెను ట్రంప్ లైంగికంగా వేధించడం ఏమిటి అంటే.. ఇప్పుడు కాదట. దాదాపు పాతికేళ్ల కిందట తనను ట్రంప్ సెక్సువల్ వేధింపులకు గురి చేశాడని ఆమె అంటోంది. ఒక మాల్ లో తన ట్రంప్ ను కలిసినట్టుగా ఆమె చెప్పింది.
ఆ సమయంలో ఒక డ్రస్ తీసుకుని వచ్చి, తనను ట్రై చేయమంటూ ట్రంప్ కోరాడని ఆమె వివరించింది. తను వద్దంటున్నా ఆ డ్రస్ ఇచ్చి తనను డ్రస్సింగ్ రూమ్ లోకి తోశాడని, ఆ వెంటనే తను కూడా డ్రస్సింగ్ రూమ్ లోకి దూరి తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆమె అంటోంది. తొంభైలలో ఇలా జరిగిందని ఆమె వివరిస్తోంది.
ఇలా ట్రంప్ శృంగార లీలలను వివరిస్తోందామె. అయితే ఆమె ఆరోపణలను ట్రంప్ యథారీతిన ఖండించాడు. ఇది వరకూ తనపై ఆరోపణలు చేసిన స్త్రీల అందరి మాటలనూ ఖండించిన తీరులోనే కారోల్ ఆరోపణలను కూడా ట్రంప్ ఖండిస్తూ ఉన్నాడు. ఆమె ఎవరో తనకు తెలియదని, ఆమెను తను ఎప్పుడూ కలవలేదని ట్రంప్ చెప్పుకొచ్చాడు!