Begin typing your search above and press return to search.
ట్రంప్ తాజా సంతకంతో ఏం జరగనుంది?
By: Tupaki Desk | 7 March 2017 7:04 AM GMTఆ మధ్యన ముస్లిం మెజార్టీ ప్రజలు ఉన్న దేశాలకు చెందిన వారు అమెరికాలోకి ప్రవేశించటంపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను సవరిస్తూ.. మరో ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేసిన సంగతి తెలిసిందే. మరి.. పాత ఆర్డర్ కు కొత్త ఆర్డర్ కు మధ్యనున్న తేడాలేంటి? తాజా ఆర్డర్ తో ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి? పాత ఆర్డర్ మాదిరి.. కొత్త ఆర్డర్ పైనా అమెరికన్లతో సహా వివిధ దేశాలు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందన్నది చూస్తే..
మొదట సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో ఏడు ముస్లిం దేశాలపై బ్యాన్ విధించగా.. తాజాగా ఆర్డర్ లో మాత్రం దాన్ని ఆరుకు తగ్గించారు. ఇరాక్ ను జాబితా నుంచి తొలగించారు. మిగిలిన దేశాలన్నీ యధావిధిగా ఉన్నాయి. అయితే.. గత ఆర్డర్ కు తాజా ఆర్డర్ కు మధ్యనున్న వ్యత్యాసం చూస్తే.. సిరియా శరణార్థులపై విధించిన నిరవధిక నిషేధాన్ని సడలించటమే కాదు.. మరికొన్ని మినహాయింపుల్ని ఇచ్చారు.
తాజా ఆర్డర్ ను చూస్తే.. ఆచితూచి తయారు చేయటంతో పాటు.. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. గత ఉత్తర్వులు వెనువెంటనే అమలు అయ్యేలా నిర్ణయం తీసుకోవటంతో.. ఎయిర్ పోర్ట్ ల దగ్గర రచ్చ రచ్చగా మారింది. ఈసారి మాత్రం అలాంటివి చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డట్లు కనిపిస్తుంది. అధ్యక్షుల వారి సంతకం పడిన తర్వాత ఆర్డర్ ను అమలుకు మధ్యన కొద్ది రోజులు గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. తాజా ఉత్తర్వు ఈ నెల 16 నుంచి అమల్లోకి రానుంది. అంటే అధ్యక్షుల వారు సంతకం చేసిన తర్వాత దాదాపు పది రోజుల సమయాన్ని ఇచ్చినట్లుగా చెప్పొచ్చు.
అదే సమయంలో జనవరి 27 సాయంత్రం ఐదు గంటలకు ముందే వీసాలు పొందిన వారు ఎప్పటికప్పుడు అమెరికా రాకపోకల్ని కొనసాగించొచ్చు. వారికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఆరు దేశాల మీద నిషేధం 90 రోజుల పాటు అమల్లో ఉంటుందని.. శరణార్థులకు ఆశ్రయం కల్పించే పథకాన్ని వచ్చే 120 రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాలోకి అనుమతించే శరణార్థుల సంఖ్యపైనా పరిమితిని విధించారు. 2017లో50 వేలకు మించి అనుమతించరు. తాజా నిషేధం అనంతరం మధ్య.. దక్షిణ ఆసియా దేశాల పర్యటనలకు అమెరికన్లు వెళ్లొద్దంటూ తన పౌరుల్ని అమెరికా కోరింది.
పాకిస్థాన్.. బంగ్లాదేశ్.. అఫ్ఘనిస్థాన్ లకు వెళ్లొద్దని పేర్కొన్న అమెరికా.. భారత్ లో పర్యటించే అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని కోరింది. తాజాగా ట్రంప్ సంతకం చేసిన నిషేధం మీద కూడా నిరసనలువెల్లువెత్తేఅవకాశం తక్కువగా ఉండే వీలుందంటున్నారు. గతంలోమాదిరి పెద్ద ఎత్తున నిరసనలు ఉండకపోవచ్చని.. కాకుంటే అభ్యంతరాలు.. కోర్టుల్లో కేసులో వేసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/