Begin typing your search above and press return to search.
డ్రీమర్స్ ను వెనక్కు పంపబోమని తెలిపిన ట్రంప్
By: Tupaki Desk | 14 Sep 2017 12:46 PM GMTఅమెరికాలో వలసదారులుగా ఉన్న డ్రీమర్స్ కు భారీ ఊరట లభించింది. అయితే అందులోనూ ట్రంప్ తనదైన శైలిలో ట్విస్ట్ పెట్టారు. అమెరికాలో డాక్యుమెంట్లు లేని వలసదారులను డ్రీమర్స్ అంటున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి వేలాది మందిని దేశం నుంచి బయటకు పంపాలని ట్రంప్ భావించారు. ఈ నిర్ణయంపై కల్లోలం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రీమర్స్ ను డిపోర్ట్ చేయకుండా ఉండేందుకు డెమోక్రాట్లు ముందుకు వచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ తో జరిపిన చర్చలు జరిపారు.
డ్రీమర్లను అమెరికాను నుంచి పంపించకుండా ఉండేందుకు ట్రంప్ అంగీకరించినట్లు డెమొక్రాట్ కాంగ్రెస్ సభ్యులు వెల్లడించారు. దీంతో సుమారు 8 లక్షల మంది వలసదారులు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. ప్రతిపక్ష డెమోక్రాట్లు ట్రంప్ తో ఓ ఒప్పందానికి వచ్చినట్లు వివరించారు. అయితే డెమొక్రాట్లతో ఒప్పందం కుదిరినట్లు వస్తున్న వార్తలను అధ్యక్షుడు ట్రంప్ ఖండించడం గమనార్హం. బోర్డర్ సెక్యూరిటీ డీల్ ను డెమొక్రాట్లు అంగీకరిస్తేనే తాను ఈ డీల్ కు అంగీకరిస్తానని, అది కూడా ఓటింగ్ లోనే తేలాలని ట్రంప్ ట్వీట్ చేశారు.
కాగా, చదువుల కోసం - ఉద్యోగాల కోసం వెళ్లి అమెరికాలోనే ఉంటున్న డ్రీమర్స్ కు ఈ ఒప్పందం వల్ల లాభం చేకూరే అవకాశాలున్నాయి. గత ఒబామా ప్రభుత్వం డెకా డ్రీమర్స్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఆ స్కీమ్ కింద వలసదారులకు రక్షణ కల్పించారు. అయితే తాజాగా ట్రంప్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం డ్రీమర్స్ అయిన వలసదారులు ఇప్పుడు అమెరికాలోనే స్టడీ - వర్క్ పర్మిట్ కూడా పొందుతారు. ఒబామా ప్రవేశపెట్టిన డ్రీమర్స్ స్కీమ్ ను రద్దు చేస్తామని ఈనెల 4వ తేదీన ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ తో ఒప్పందం కుదిరిన దాన్ని కాంగ్రెస్ లో తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే విపక్ష డెమోక్రాట్లు ఎంట్రీ ఇచ్చి పరిష్కారం చూపేలా చేశారు.