Begin typing your search above and press return to search.

నోబెల్ కాదు...ప్ర‌పంచాన్ని జ‌యిస్తా:ట‌్రంప్

By:  Tupaki Desk   |   10 May 2018 10:54 AM GMT
నోబెల్ కాదు...ప్ర‌పంచాన్ని జ‌యిస్తా:ట‌్రంప్
X
2014లో అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత అగ్ర‌రాజ్యంలో లోక‌ల్ సెంటిమెంట్ బ‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. దానికితోడు, ఏడు దేశాల‌వారిని అమెరికాలోకి అనుమతించ‌కుండా ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌ల‌పాలైంది. వీటికితోడు హెచ్ వ‌న్ బీ వీసాల్లో కోత విధించ‌డం....స్థానికేత‌రుల‌కు ఉద్యోగావకాశాలు త‌గ్గేలా ప‌లు వీసాల‌ నిబంధ‌న‌లను ట్రంప్ క‌ఠిన‌తరం చేయ‌డంతో ట్రంప్ పై వ్య‌తిరేకత పెరిగింది. అమెరిక‌న్ల‌కు ట్రంప్ నూరిపోసిన లోక‌ల్ సెంటిమెంట్ వ‌ల్ల‌....కూచిభొట్ల శ్రీ‌నివాస్ తో పాటు మ‌రెన్నో జాత్యాహంకార దాడులు జ‌రిగాయి. ఇటువంటి నేప‌థ్యంలో ప్ర‌పంచ ప్రఖ్యాతి గాంచిన నోబెల్ శాంతి బ‌హుమ‌తికి ట్రంప్ పేరు ప‌రిశీల‌న‌లో ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. కానీ, కొద్ది రోజుల క్రితం కొరియాను ఒక‌టి చేయ‌డంలో ట్రంప్ కీల‌క పాత్ర పోషించ‌డంతో ఆయ‌న పేరు తెర‌పైకి వ‌చ్చింది. ట్రంప్ న‌కు నోబెల్ వ‌స్తుంద‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వెలువుడుతున్నాయి. అయితే, తాజాగా, త‌న‌కు నోబెల్ ప్రైజ్ పై పెద్ద‌గా ఆసక్తి లేదని.....ట్రంప్ అన్నారు. త‌న‌కు ప్రపంచాన్ని జయించాలని ఉంద‌ని, నోబెల్ క‌న్నా అదే గొప్ప బహుమత‌ని ట్రంప్ అన్నారు. ఓ మీడియా స‌మావేశం సంద‌ర్భంగా ట్రంప్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

కొద్దిరోజుల క్రితం ఉత్త‌ర‌, ద‌క్షిణ కొరియా అధ్య‌క్షులు చారిత్ర‌క క‌ర‌చాల‌నం చేసిన సంగ‌తి తెలిసిందే. దశాబ్దాల‌నాటి వైరానికి తెర దించుతూ వారిద్ద‌రూ శాంతి చ‌ర్చ‌లు జ‌రిపారు. దాంతోపాటు ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ తో ట్రంప్ త్వ‌ర‌లో భేటీ కూడా కాబోతున్నారు.ట్రంప్ చొర‌వ‌తోనే ఇదంతా సాధ్య‌ప‌డింద‌ని, అందువ‌ల్ల నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంపే అర్హుడని దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్ అభిప్రాయ‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే త‌న‌కు నోబెల్ పై ఆస‌క్తి లేద‌ని ట్రంప్ అన్నారు. ప్ర‌తిష్టాత్మ‌క నోబెల్ బహుమతి రావాల‌ని అంద‌రూ భావిస్తార‌ని, కానీ త‌న‌కు మాత్రం ఆ బ‌హుమ‌తిపై ఆసక్తి లేద‌ని ట్రంప్ అన్నారు. త‌న‌కు ప్ర‌పంచాన్ని జ‌యించాల‌ని ఉంద‌ని, ప్రపంచ విజయాన్ని బహుమతిగా తీసుకోవానే కోరిక ఉందని ట్రంప్ అన్నారు. కిమ్ జాంగ్‌ ఉన్ తో త‌న భేటీ ప్రపంచానికి శుభ‌రిణామమ‌ని ట్రంప్ అన్నారు. కొన్నేళ్లుగా ఎవరికీ రాని ఆలోచ‌న త‌న‌కు వ‌చ్చింద‌ని, ఈ భేటీ వ‌ల్ల ఉత్తర కొరియా - దక్షిణ కొరియా - జపాన్‌ దేశాలకు మంచి జరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. ఈ చర్చలు సఫల‌మ‌య్యేందుకు స‌హ‌క‌రిస్తోన్న చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ కు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. తాము చైనాతో వ్యాపారసంబంధాలు కొన‌సాగిస్తామ‌ని అన్నారు.