Begin typing your search above and press return to search.

చైనాతో 'మాటల్లేవ్' అన్న ట్రంప్

By:  Tupaki Desk   |   12 Nov 2016 11:07 AM GMT
చైనాతో మాటల్లేవ్ అన్న ట్రంప్
X
అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఫోన్ చేసి మాట్లాడారా..? లేదా..? మీడియాలో భిన్న రకాలుగా ప్రచారమవుతున్న ఈ అంశంపై ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. తాను అధ్యక్షుడిగా గెలిచిన తరువాత చాలామంది ప్రపంచ దేశాధినేతలతో మాట్లాడానని... తనకు వారు ఫోన్ చేసి అభినందించారని.. కానీ, జిన్ పింగ్ తో మాత్రం మాట్లాడలేదని స్పష్టం చేశారు. చైనా అధ్యక్షుడితో తప్ప చాలా మంది ప్రపంచ నేతలతో మాట్లాడానన్నారు. ట్రంప్‌ గెలిచాక చైనా అధ్యక్షుడు ఫోన్‌ చేసి ఆయన్ను అభినందించినట్టు చైనా సెంట్రల్‌ టీవీ వెల్లడించడంతో ఈ చర్చ మొదలైంది.

జిన్ పింగ్ ట్రంప్‌ కు ఫోన్‌ చేసి అభినందించారని, ఇరు దేశాలు కలసి పనిచేయాల్సిన అవసరముందని చెప్పారని.. జిన్‌ పింగే ఈ విషయం చెప్పారంటూ చైనా సెంట్రల్ టీవీ ఓ కథనం అల్లింది. దీనిపై వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తో మాట్లాడిన ట్రంప్‌.. చైనా అధ్యక్షుడితో తప్ప చాలా మంది ప్రపంచ నేతల నుంచి అభినందనలు అందుకున్నానని చెప్పారు. ట్రంప్‌ ప్రతినిధి హోప్‌ హిక్స్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

కాగా ఎన్నికలకు ముందు ఓ ర్యాలీలో ట్రంప్‌ మాట్లాడుతూ.. చైనా అమెరికా ఉద్యోగాలను దోచుకుంటోందని, తమ దేశాన్ని అత్యాచారం చేస్తోందని, ఇకమీదట సాగబోదని తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా సంబంధాలు ఎలా ఉండబోతాయన్నది ఇతర దేశాలు గమనిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ట్రంప్, జిన్ పింగ్ లు మాట్లాడుకున్నారని... కలిసి పనిచేద్దామని అనుకున్నారన్న వార్తలు అమెరికన్లను ఆశ్చర్యపరిచాయి. ట్రంప్ చెప్పినవన్నీ ఎన్నికల కోసం చెప్పిన గాలి మాటలేనా అన్న విమర్శలు వచ్చాయి. అయితే... ట్రంప్ వాటిని పటాపంచలు చేస్తూ చైనా మీడియాదంతా కట్టుకథని తేల్చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/