Begin typing your search above and press return to search.

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీపై సంచలన ప్రకటన చేసిన డొనాల్డ్ ట్రంప్

By:  Tupaki Desk   |   4 Nov 2022 11:30 AM GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీపై సంచలన ప్రకటన చేసిన డొనాల్డ్ ట్రంప్
X
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి దిగబోతున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఈ నవంబర్‌లో అధ్యక్ష బరిలో దిగేందుకు మూడవ బిడ్‌ను వేయబోతున్నట్టు ప్రకటించారు.

అతను మంగళవారం మధ్యంతర ఎన్నికలకు పోటీ చేయడాన్ని పరిశీలిస్తున్నాడు. ట్రంప్ సలహాదారుల ప్రకారం.. రిపబ్లికన్ ల విజయాల నుండి లబ్ది పొందే మార్గాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.

గురువారం సాయంత్రం అయోవాలోని సియోక్స్ సిటీలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024లో తిరిగి అధికారంలోకి రాబోతున్నాం.. వైట్ హౌస్ ను తిరిగి దక్కించుకుంటాం.. మధ్యంతర ఎన్నికలకు ముందు రిపబ్లికన్ల కోసం ప్రచారం చేస్తానంటూ ప్రకటించాడు.

"ట్రంప్ 2024లో పోటీ చేస్తారని నేను అనుకుంటున్నాను" అని ఒక సీనియర్ సలహాదారు వెల్లడించారు. రిపబ్లికన్ల తరుఫున తనను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించాలని కోరుకుంటున్నాడని తెలిపారు. జోబైడెన్ కంటే మెరుగు అని ట్రంప్ భావిస్తున్నాడు. ఇదే అతనికి గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుందని అంటున్నాడు.

ట్రంప్ బరిలో ఉన్నట్టు ప్రకటించడంతో పార్టీ నామినేషన్ల కోసం అతడితో పోటీపడే ప్రత్యర్థులను కూడా మినహాయించవచ్చని సలహాదారులు అంటున్నారు. ఈ మేరకు పోటీదారులు వైదొలిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మంగళవారం తర్వాత తిరిగి ఎన్నికల ప్రచారంలో తన అభ్యంతరాలను ప్రకటించాలని ట్రంప్ కోరారు.

స్వతంత్ర అభ్యర్థి అంచనాదారులు, పోల్‌లు అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్‌లు మెజారిటీని పొందే అవకాశం ఎక్కువగా ఉందని, సెనేట్‌పై నియంత్రణ సాధించవచ్చని సూచించినట్లు సమాచారం. సెనేట్‌పై నియంత్రణ సాధించడం వల్ల రాబోయే రెండేళ్లలో అధ్యక్షుడు జో బిడెన్ ఎజెండాను నిరోధించేందుకు రిపబ్లికన్‌లకు అధికారం లభిస్తుంది. మెజార్టీ వస్తుందనే ట్రంప్ మరోసారి పోటీకి సై అంటున్నట్టు తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.