Begin typing your search above and press return to search.

ట్రంప్‌.. సారీ కూడా చెబుతారు బాస్‌!

By:  Tupaki Desk   |   26 Jan 2018 11:11 AM GMT
ట్రంప్‌.. సారీ కూడా చెబుతారు బాస్‌!
X
గ‌తంతో పోలిస్తే ఇప్పుడు నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడే నేత‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తారు. గ‌తంలో ఈ త‌ర‌హా నేత‌లు కీల‌క ప‌ద‌వుల్లో చాలా చాలా త‌క్కువ‌గా క‌నిపించేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్ర‌ముఖ స్థానాల్లో ఉండ‌టంతో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఎప్ప‌టిక‌ప్పుడు వేడెక్కుతూ ఉంటోంది. ప్ర‌పంచానికి పెద్ద‌న్న లాంటి అమెరికా అధ్య‌క్ష స్థానంలో ట్రంప్ లాంటి తెంప‌రి మాట‌లు మాట్లాడే ట్రంప్ కూర్చుంటార‌ని ఎవ‌రు మాత్రం ఊహించ‌గ‌ల‌రు.

త‌న నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడే ఆయ‌న‌.. ఆ మ‌ధ్య తాను చేసిన ప‌నికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఒక‌సారి దేనికైనా ఫిక్స్ అయితే.. అదే రీతిలో వ్య‌వ‌హ‌రించే మొండి వైఖ‌రికి భిన్నంగా ట్రంప్ ఈసారి సారీ చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ఆయ‌న సారీ ఎందుకు చెప్పారు? ఏ విష‌యంలో చెప్పారు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెతికితే గ‌తంలోకి వెళ్లాల్సి ఉంటుంది.

కొన్ని నెల‌ల క్రితం బ్రిటిష్ మిత‌వాద సంస్థ అయినా బ్రిట‌న్ ఫ‌స్ట్ డిప్యూటీ నేత జేదా ఫ్రాంన్స‌న్ మూడు ముస్లిం వ్య‌తిరేక వీడియోల‌ను సోష‌ల్ మీడియా అయిన ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు. వీటిని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ రీట్వీట్ చేయ‌టంతో ఒక్క‌సారి ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి. నిర‌స‌న‌లు తోడ‌య్యాయి. ఈ వ్య‌వ‌హారం అగ్ర‌రాజ్యాలైన అమెరికా.. బ్రిట‌న్ దేశాల మ‌ధ్య దూరాన్ని పెంచేలా చేశాయి. వివాదాస్ప‌ద వీడియోల్ని ట్రంప్ రీ ట్వీట్‌ చేయ‌టంతో పెను దుమారాన్ని రేపింది.

చివ‌ర‌కు బ్రిట‌న్ ప్ర‌ధాని థెరిసా సైతం స్పందించాల్సి వ్చింది. నాలుగు కోట్ల మందికి ట్రంప్ త‌ప్పుడు సంకేతాలు పంపుతున్నార‌న్న వ్యాఖ్య‌ను ఆమె చేశారు. ఇది మంచి ప‌ద్ధ‌తి కాద‌న్న ఆమె మాట‌లు ట్రంప్‌కు కోపం తెప్పించ‌టంతో పాటు.. త‌న‌కు కౌంట‌ర్ ఇవ్వ‌టం మానేసి బ్రిట‌న్ లో పెరుగుతున్న ఉగ్ర‌వాదాన్ని క‌ట్ట‌డి చేయాలంటూ పంచ్ వేశారు. దీంతో ఈ వ్య‌వ‌హారం మ‌రింత ముదిరింది. చివ‌ర‌కు ట్రంప్ బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న మీద కూడా ప్ర‌భావం చూపింది.

త‌న‌పై బ్రిట‌న్ లో ఆగ్ర‌హావేశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న ఉద్దేశంతో ఆయ‌న ఆ దేశ ప‌ర్య‌ట‌న‌ను సైతం వాయిదా వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా తాను రీట్వీట్ చేసిన ముస్లిం వ్య‌తిరేక వీడియోల‌పై ఆయ‌న రియాక్ట్ అయ్యారు. గ‌తంలో ముస్లింల‌ను జాత్యాంహాకార ప్ర‌జ‌లుగా అభివ‌ర్ణించార‌ని మీరు న‌న్ను అడ‌గొచ్చు. కానీ.. అ విష‌యంలో తాను త‌ప్పు చేశాన‌ని.. సారీ చెబుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌పంచ దేశాల‌తో మైత్రి చేయ‌ట‌మే త‌న ఉద్దేశ‌మే అని..ఆయ‌న సంధి జెండా ఎగుర‌వేశారు. దావోస్ లో ఇటీవ‌ల ఒక ఛాన‌ల్‌ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సారీ చెప్పిన వీడియోను ఈ నెల 28న ప్ర‌సారం కానుంది. ట్రంప్ లాంటి తెంప‌రి నేత నోటి వెంట సారీ రావ‌టం విశేషంగా చెప్ప‌క త‌ప్ప‌దు.