Begin typing your search above and press return to search.
డొనాల్ట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..నవంబర్ లో కరోనా వ్యాక్సిన్!
By: Tupaki Desk | 7 Aug 2020 2:45 PM GMTఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వ్యాక్సిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి అంతానికి రోజులు దగ్గర పడుతున్నాయని, అమెరికా చేతిలో నవంబర్ 3 నాటికి కరోనా వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ ఉంటుందని ఆయన తెలిపారు. గురువారం నాడు ఓ రేడియో కార్యక్రమం ద్వారా మాట్లాడిన ట్రంప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేసారు. వ్యాక్సిన్ తయారీలో అమెరికా సంస్థలు ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు. అయితే , ఈ ఏడాది నవంబర్ 3నే .. ప్రెసిడెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ యూఎస్ వద్ద ఉంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కరోనా విలయతాండవం చేస్తున్నప్పటికీ ఎన్నికలను వాయిదా వేసేందుకు వీలులేకపోవడంతో అనుకున్నట్టుగానే ఎన్నికలు నవంబర్ లో జరగబోతున్నాయి.
ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రత్యర్థి వర్గం ఆరోపణలకు దిగింది. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరువకాగా, ఇప్పటివరకూ 1.61 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు. కానీ , సీడీసీ అధికారులు కరోనా వాక్సిన్ రిలీజ్ విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, 2021ప్రారంభంలో వాక్సిన్ వస్తుందని చెప్పారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం కరోనా వాక్సిన్ నవంబర్ మొదటివారంలోనే అమెరికాలో అందుబాటులోకి వస్తుందని చెప్పడంతో ఇప్పుడు సంచలనంగా మారింది.