Begin typing your search above and press return to search.
ఒబామాను ఏసేయాలన్న ట్రంప్ పనిమనిషి
By: Tupaki Desk | 13 May 2016 12:41 PM ISTయజమాని ఒకలా ఉంటే సేవకుడు మరోలా ఉంటాడా? అన్నట్లుగా తాజాగా ట్రంప్ కు సేవకుడిగా వ్యవహరించిన వ్యక్తి వ్యవహారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి వచ్చిన నాటి నుంచి తన నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మాటలు ఎన్ని మంటలు రేపాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల రిపబ్లికన్ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దిగటం ఖాయమని తేలిన తర్వాత నుంచి ట్రంప్ కాస్త ఆచితూచి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ట్రంప్ కు మాత్రమే కాదు ఆయన దగ్గర సేవకుడి (పనిమనిషి)గా ఒకప్పుడు సేవలందించిన సేవకుడికి కూడా నోటి దురద ఎక్కువన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ట్రంప్ దగ్గర సేవకుడిగా పని చేసిన సెనెకల్ అనే పెద్దమనిషి తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన మేసేజ్ కలకలం రేపుతోంది. నిజానికి ఈయన పెట్టిన మేసేజ్ ప్రైవేటు మెసేజ్. కొందరు మాత్రమే చదివేందుకు వీలుగా పెట్టిన ఈ మేసేజ్ వివరాలు బయటకు రావటం పెద్ద కలకలానికి కారణమైంది.
ఇంతకి ఆయన పోస్ట్ చేసిన మేసేజ్ ఏమిటంటే.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను చంపేయాలన్నది ఆయన మాట. ఎందుకంటే.. తాను అమితంగా ప్రేమించే అమెరికాను ఒబామా చెడగొడుతున్నారని.. అందుకే ఒబామాను ఏసేయాలంటూ ఈ 84 ఏళ్ల పెద్దమనిషి ప్రైవేటు మేసెజ్ పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని మదర్ జోన్స్ అనే పత్రిక ప్రచురించటంతో సీక్రెట్ సర్వీసులు ఒక్కసారిగా అలెర్ట్ అయిపోయాయి. ట్రంప్ దగ్గర గతంలోపని చేసిన ఈ సేవకుడి వ్యవహారశైలి మీద ఆరా తీయటం మొదలు పెట్టినట్లుగా చెబుతున్నారు.