Begin typing your search above and press return to search.
ట్రంప్ షాక్ కు అధికారిక ముద్ర పడింది
By: Tupaki Desk | 19 April 2017 5:09 AM GMTఅమెరికా సరుకులనే కొనండి.. అమెరికన్ లనే పనిలో పెట్టుకోండి అంటూ ప్రచారం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానికులకే ఉద్యోగాలు కల్పించేందుకు హెచ్1బీ వీసాలకు కళ్లెం వేశారు. విదేశాల నుంచి ఉన్నతస్థాయి నిపుణులను మాత్రమే అమెరికాలోనికి అనుమతించాలని, అధిక జీతం పొందేవారికే హెచ్1బీ వీసాలు ఇవ్వాలని ట్రంప్ తాజా ఆదేశాలపై జారీ చేశారు. దీంతో ఐటీ విప్లవానికి జీవంపోసి అపార సంపదను సృష్టించిన హెచ్1బీ వీసాను అమెరికా ప్రభుత్వం అందనంత ఎత్తులో నిలబెట్టనుంది. ఇలా భారతీయ ఐటియన్లకు అధ్యక్షుడు ట్రంప్ మరో కొర్రీపెట్టారు. వలసవాదుల దేశంలో భూమిపుత్రుల పేరిట విపరీత ధోరణులకు శ్రీకారం చుట్టారు.
అమెరికా ప్రథమం అన్న తన ఎన్నికల నినాదానికి అనుగుణంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాలకు కళ్లెం వేయనున్నారు. ఉన్నతస్థాయి నైపుణ్యాలు కలిగి అధిక వేతనానికి అర్హులైన వారినే దేశంలోకి అనుమతిస్తామని ఆంక్షలు విధించనున్నారు. భారత్‌తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే ఐటీయన్లకు అత్యంత ప్రీతిపాత్రమైన తాత్కాలిక వీసా నిబంధనలను కఠినతరం చేయనున్నారు. అమెరికా సరుకులనే కొనండి.. అమెరికన్ లనే పనిలో పెట్టుకోండి అనే శీర్షికతో తాజాగా ఫర్మానా జారీ చేయడానికి ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆదేశాలపై ట్రంప్ సంతకం కోసం ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాన్ సొంత రాష్ట్రమైన విస్కాన్సిన్ లోని కినోషాలో ఏర్పాట్లు చేశారు. విదేశాల నుంచి ఉన్నతస్థాయి నిపుణులను మాత్రమే అమెరికాలోనికి అనుమతించాలని, అధికజీతం పొందేవారికే హెచ్1బీ వీసాలు ఇవ్వాలని ట్రంప్ తాజా ఫర్మానా సూచించనున్నది. అమెరికన్ల ఉద్యోగాలు - వేతనాలు కాపాడాలన్న లక్ష్యంతో విదేశీయులను దేశంలోనికి అనుమతించే విషయంలో రూపొందించిన అన్ని చట్టాలను కఠినంగా అమలు చేయాలని విదేశాంగశాఖ - న్యాయశాఖ - అంతరంగిక భద్రతాశాఖ - కార్మిక శాఖలకు ఫర్మానా స్పష్టం చేయనుంది. అమెరికా ఉద్యోగులను రక్షించేందుకు వలస వ్యవస్థలో జరుగుతున్న మోసాలను - దుర్వినియోగాన్ని అరికట్టేలా, కేంద్ర సర్కారు కొనుగోళ్లలో అమెరికాలో తయారైన సరుకులకే ప్రాధాన్యం ఇచ్చేలా ఈ ఫర్మానా రూపొందించినట్టు తెలిసింది.
హెచ్1బీ వీసాలపై అధ్యక్షుడు ట్రంప్ జారీ చేయనున్న ఫర్మానాపై విపక్ష డెమొక్రాట్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. హెచ్1బీ వీసా ప్రక్షాళనకు ట్రంప్ నడుంబిగించడం హర్షదాయకమని సెనేటర్ షెరాడ్ బ్రౌన్ సమర్థించారు. అమెరికన్లకు ఈ చర్య ద్వారా న్యాయం జరుగుతుందన్నారు. కాగా, తాము ఇదివరకే సమగ్ర వీసా సంస్కరణ బిల్లును ముందుకు తెచ్చామని, ఇప్పుడు ట్రంప్ కేవలం సమీక్షకు పిలుపునిచ్చారని సెనేట్ మైనారిటీ నాయకుడు చార్లెస్ షూమర్ కొట్టిపారేశారు. ట్రంప్ ఇప్పటివరకూ ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారని ఆయన ఆరోపించారు.
కాగా, హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయాలన్న ట్రంప్ ఫర్మానా మరింత తీవ్రమైన పర్యవేక్షణ, కఠినమైన అమలు విధానాలు రాబోతున్నట్టు సూచిస్తున్నాయని భారత ఐటీ పారిశ్రామిక మండలి నాస్కాం వ్యాఖ్యానించింది. భారతీయ కంపెనీలు తక్కువ జీతాలకు ఉద్యోగులను నియమించుకుంటాయని ఏవేవో ఆరోపణలు చేయడం మంచిది కాదని నాస్కాం పేర్కొన్నది. హెచ్1బీ - ఎల్-1 వీసాలను కఠినం చేస్తే అమెరికా కంపెనీలకే నష్టమని ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికన్లనే నియమించాలంటే స్థానికంగా నిపుణులు అందుబాటులో లేరని గుర్తు చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/