Begin typing your search above and press return to search.

విలేక‌రుల విందుకు ట్రంప్ జంప్‌

By:  Tupaki Desk   |   27 Feb 2017 4:23 AM GMT
విలేక‌రుల విందుకు ట్రంప్ జంప్‌
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సారి జ‌ర్న‌లిస్టుల‌కు నేరుగా షాక్ ఇచ్చారు. వైట్‌ హౌస్ విలేకరుల సంఘం (డబ్ల్యూహెచ్‌ సీఏ) ఇచ్చే విందుకు హాజరుకాలేనని ఆయ‌న ప్రకటించారు. 'ఈ ఏడాది డబ్ల్యూహెచ్‌ సీఏ ఇచ్చే విందుకు నేను హాజరుకాలేను. అంతా మంచి జరగాలని కోరుకోండి. శుభసాయంత్రం' అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. మీడియాతో జరుగుతున్న వైరమే ఇందుకు కారణమని తెలుస్తోంది. విందులో అధ్యక్షుడితో పాటు పాత్రికేయులు, ప్రముఖులు తదితరులు పాల్గొనడం ఆనవాయితి. 1972లో అధ్యక్షుడు రిచర్ నిక్సన్ తొలిసారి విలేకర్ల విందుకు హాజరుకాలేదని అని నేషనల్ పబ్లిక్ రేడియో తెలియజేసింది.

ద న్యూయార్క్ టైమ్స్ - సీఎన్‌ ఎన్ - బీబీసీ పత్రికలు తమ కెమెరాలను శ్వేతసౌధంలోకి తీసుకురావొద్దంటూ బహిష్కరించిన మరుసటి రోజే ట్రంప్ విందుకు హారుజకాలేనని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. 1920 నుంచి డబ్ల్యూహెచ్‌ సీఏ విందు ఏర్పాటు చేస్తున్నది. ఈ ఏడాది వచ్చే ఏప్రిల్ 29న విందు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీనిపై సంఘం అధ్యక్షుడు జెఫ్ మాసన్ స్పందించారు. ట్రంప్ రాకపోయినా విందు జరుగుతుంది. మొదటి సవరణ వేడుకలో భాగంగా నిర్వహిస్తున్న విందులో స్వతంత్ర మీడియా కీలకపాత్ర పోషిస్తుంది అని చెప్పారు.

మ‌రోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తో అక్కడి భారత రాయబారి నవ్‌ తేజ్ సర్నా భేటీ అయ్యారు. సర్నాతోపాటు కొత్తగా వచ్చిన వివిధ దేశాలకు చెందిన రాయబారులను ట్రంప్ శ్వేతసౌధంలోని కార్యాలయంలో కలుసుకున్నారు. వారితో ట్రంప్ వ్యక్తిగతంగా ఫొటోలు దిగారు. ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాక భారత రాయబారితో సమావేశం కావడం ఇదే మొదటిసారి. 1980 ఐఎఫ్‌ ఎస్ బ్యాచ్‌ కు చెందిన నవ్‌ తేజ్ సర్నా అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో గత నవంబరు 8వ తేదీన అక్కడకు వెళ్లారు. సర్నా గతంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు అధికార ప్రతినిధిగా, ఇజ్రాయెల్‌ లో దౌత్యాధికారిగా పనిచేశారు. శనివారం జాతీయ గవర్నర్ల అసోసియేషన్ ఇచ్చిన విందులో 25 రాష్ర్టాల గవర్నర్లు పాల్గొనగా.. దీనికి సర్నాకు కూడా ఆహ్వానం అందింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/