Begin typing your search above and press return to search.

దారికి వ‌స్తున్న ట్రంప్‌ ..అమెరికాలో సెటిల్ అవుతోంది

By:  Tupaki Desk   |   21 Jan 2019 5:14 AM GMT
దారికి వ‌స్తున్న ట్రంప్‌ ..అమెరికాలో సెటిల్ అవుతోంది
X
దాదాపు నెల రోజులుగా అమెరికా ప్రభుత్వం మూతపడి ఉన్న నేపథ్యంలో ఆ పరిస్థితికి తెరదించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నాలు ప్రారంభించారు. క్రమ వలసలను నిరోధించేందుకు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు 5.7 బిలియన్ డాలర్లు ఇవ్వాలని ట్రంప్ కోరుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు డెమోక్రాట్లు ససేమిరా అంటున్నారు. దీంతో పలు ఆర్థిక బిల్లులకు కాంగ్రెస్ ఆమోదం లభించక ప్రభుత్వం మూతపడింది. ఈ కారణంగా సుమారు 8 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు అందక వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ట్రంప్ రాజీమార్గం ప్ర‌తిపాదించారు. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించేందుకు 5.7 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ప్రతిగా అక్రమ వలసదారులకు పలు రక్షణలు కల్పించనున్నట్లు చెప్పారు.

శ్వేతసౌధం నుంచి టెలివిజన్‌ లో ట్రంప్ ప్రసంగిస్తూ... ప్రస్తుత ప్రతిష్ఠంభనను తొలిగించేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో అక్రమంగా దేశంలోకి ప్రవేశించినవారికి (డ్రీమర్లు), హింస, ప్రకృతి విపత్తుల కారణంగా వలస వచ్చిన వారికి పలు రక్షణలు కల్పించనున్నట్లు చెప్పారు. 7 లక్షల మంది డ్రీమర్లు, టీపీఎస్ (టెంపరరీ ప్రొటెక్టెడ్ స్టేటస్) కింద నివసిస్తున్న మరో 3 లక్షల మందికి మూడేళ్ల‌ పాటు వర్క్ పర్మిట్లు, సామాజిక భద్రత నంబర్ల కొనసాగింపు, దేశ బహిష్కరణ నుంచి రక్షణలు కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే తక్షణ మానవతా సాయం కింద 800 మిలియన్ డాలర్లు, యూఎస్ పోర్టుల్లో భద్రత పెంపులో భాగంగా డ్రగ్ డిటెక్షన్ టెక్నాలజీ కోసం మరో 805 మిలియన్ డాలర్లు ఇవ్వాలని ట్రంప్ కోరారు. సరిహద్దు భద్రత పెంపునకు కూడా ఆయన పలు సూచనలు చేశారు.

అయితే, ట్రంప్ ప్రతిపాదనలను డెమోక్రాట్లు తిరస్కరించారు. ఇది విజయవంతం కాదని తేల్చిచెప్పారు. వలస విధానంపై చర్చల కంటే ముందు ప్రభుత్వాన్ని తెరవాలని డిమాండ్ చేశారు. ఇవి ఆమోదయోగ్యం కావని స్పీకర్ నాన్సీ పెలీస్ స్పష్టం చేశారు. డ్రీమర్లు, టీపీఎస్ కింద నివసిస్తున్న వారికి శాశ్వత పరిష్కారం ఇందులో సూచించలేదన్నారు. మొత్తంగా ఇవి విశ్వాసం కలిగించేవిగా లేవన్నారు. దీంతో స‌మ‌స్య ఇంకా పెండింగ్ ద‌శ‌లోనే ఉంది.