Begin typing your search above and press return to search.

ట్రంప్ ప్రెస్ సెక్రటరీకి షాకిచ్చిన భారత మహిళ

By:  Tupaki Desk   |   13 March 2017 2:43 PM GMT
ట్రంప్ ప్రెస్ సెక్రటరీకి షాకిచ్చిన భారత మహిళ
X
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పెరిగిన జాతి వివక్ష గురించి ఒక భారతీయ మహిళ చేసిన చర్య సంచలనంగా మారటమే కాదు.. పెను చర్చకు దారి తీసింది. కలలో కూడా ఊహించని రీతిలో వ్యవహరించిన ఆమె వైనం సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమెరికాలో చోటు చేసుకుంటున్నసంఘటనలతో పాటు..ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో పెరిగిన జాతివివక్ష గురించి ఆమె సూటిగా ప్రశ్నించింది.

అమెరికా రాజధాని వాషింగ్టన్ నగరంలోని ఒక యాపిల్ స్టోర్ లో షాపింగ్ చేయటానికి వచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్. ఆయన్ను గమనించిన 33 ఏళ్ల భారతీయ మహిళ శ్రీ చౌహాన్ మెరుపు వేగంగా ఆయన వద్దకు దూసుకెళ్లి.. ఫాసిస్ట్ కోసం పని చేయటం ఎలా ఉంది?అని ప్రశ్నించింది. ఊహించని పరిణామానికి కంగుతిన్న ఆయన.. చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు.

అయినప్పటికీ శ్రీ చౌహాన్ మాత్రం వెనక్కి తగ్గకుండా.. ట్రంప్ జాతి విద్వేషకుడని.. దేశద్రోమానికి పాల్పడినట్లుగా ఆయనతో వాగ్వాదానికి దిగారు.తాను మాట్లాడుతున్న మాటల్ని ఆమె రికార్డు చేశారు. ఆమె తీరుకు స్పందించిన స్పైసర్..అమెరికా చాలా గొప్ప దేశమని..‘‘నువ్వు ఇక్కడ ఉండటానికి దేశ గొప్పతనమే కారణం’’ అని బదులిచ్చారు.

దీనికి స్పందించిన శ్రీ చౌహాన్.. ‘‘గొప్ప దేశం ఎలా అవుతుంది? రష్యా సాయంతో మీరు అధికారంలోకి వచ్చారు. మీరు నేరస్తులు కారా?’’ అంటూ ప్రశ్నించారు. జరిగిన వ్యవహారాన్ని ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఒక ఎన్జీవోలో పని చేస్తున్న శ్రీ చౌహాన్ తీరు సోషల్ మీడియలో ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/