Begin typing your search above and press return to search.
ట్రంప్ వస్తే తలనొప్పి దాంతోనేనా?
By: Tupaki Desk | 12 Nov 2016 9:27 AM GMTట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాతో మన సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి.. భారత్ మోడీ ప్రధాని అయిన తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఉన్నత స్థాయికి చేరాయి. గత రెండేళ్లుగా ఇండియా - అమెరికాలు చెట్టపట్టాలేసుకున్నాయి. కానీ... అమెరికా అధ్యక్ష పీఠంపైకి ఇప్పుడు ట్రంప్ వస్తుండడంతో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్న ఉత్కంఠ నెలకొంటోంది. పాక్ పట్ల ట్రంప్ వ్యతిరేకంగా ఉండడం.. భారత్ కు సానుకూలంగా ఉండడం మంచి పరిణామమే అయినా హెచ్-1బీ వీసాల విషయంలో మాత్రం ట్రంప్ ఆలోచనలు భారత్ కు ఇబ్బందికరమే ఈ విషయంలో ట్రంప్ ఏం చేస్తారన్నదే రెండు దేశాల సంబంధాల్లో కీలకాంశం కానుంది.
ట్రంప్ పాలనలో భారతీయులకు హెచ్1బీ వీసాలు కష్టతరం కానున్నాయనే అనిపిస్తోంది. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వలస విధానం తిరగరాసేందుకు పదిసూత్రాల కార్యక్రమం అమలు చేయబోతున్నారు. కొన్ని దేశాలకు వీసా సౌకర్యం నిలిపివేత తదితర అంశాలు అందులో ఉన్నాయంటున్నారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో వలసల నిరోధంపైనే ఎక్కువగా మాట్లాడారు. ట్రంప్ పర్యవేక్షక బృందం ఆ హామీలను విధానాలుగా మార్చను న్నట్లు సూచనప్రాయంగా తెలిపింది.
మెక్సికోతో దక్షిణ సరిహద్దు పొడవునా గోడ నిర్మా ణం, సరిహద్దులు దాటివచ్చేవారిని పట్టుకొని వదిలేయడమనే విధానానికి స్వస్తి - నేరస్థులైన చొరబాటుదార్ల పట్ల ఏ మాత్రం క్షమ చూపకపోవడం - ఆశ్రయమిచ్చే నగరాలకు నిధుల నిలిపివేత - రాజ్యాంగ విరుద్ధ్దమైన పరిపాలక ఆదేశాలను రద్దు - కఠినంగా వలస చట్టాల అమలు వీటిలో ఉన్నాయి.బయోమెట్రిక్ వీసా పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు, ఉద్యోగాలు-ప్రయోజనాల ఆకర్షణను లేకుండా చేయడం గురించి ట్రంప్ అధికార మార్పిడి బృందం సూచనలిస్తోంది. విదేశీ నిపుణుల కన్నా అమెరికా సొంత కార్మికుల ప్రయోజనాల రక్షణకు పెద్దపీట వేయాలనేది ట్రంప్ వాదన. అందుకు హెచ్1బీ వీసా కనీస వేతన పరిమితిని లక్ష డాలర్లకు పెంచాలని చూస్తున్నారు. ఈ నిబంధన భారతీయులకు వీసాలు దక్కనివ్వదని నిపుణులు చెప్తున్నారు. అయితే... ఒబామా కూడా మొదటి సారి ఎన్నిక కావడానికి ముందు ఇలాగే బీరాలు పలికినా తన ఎనిమిదేళ్ల పదవీకాలంలో చెప్పింది చేయడం తక్కువే. ట్రంప్ కూడా ఎన్నికల ప్రచారం చెప్పిన అన్నిటికీ కట్టుబడి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా హెచ్1బీ వీసాలు కట్టడి చేస్తే సిలికాన్ వ్యాలీ నుంచి ట్రంప్ కు తీవ్ర ప్రతిఘటన తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/