Begin typing your search above and press return to search.
హెచ్ 1 బీ వీసాలపై పడిన ట్రంప్ చూపు
By: Tupaki Desk | 14 Nov 2016 4:57 PM GMTభారతీయ ఐటీ కంపెనీలు - దేశ ఐటీ నిపుణులకు అమెరికాలో అత్యంత భరోసా ఇచ్చిన వీసాలపై అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టననున్న డొనాల్డ్ ట్రంప్ కన్నుపడింది. హెచ్1బీ వీసాలపై ట్రంప్ సమీక్ష నిర్వహించాలని అమెరికాలోని ఐటీ కంపెనీలకు కేంద్రమైన సిలికాన్ వ్యాలీ నుంచి కార్యకలాపాలు నిర్వహించే సీఈఓ ఒకరు ప్రతిపాదించారు. లారెల్ స్ట్రాటజీస్ అనే కంపెనీ సీఈఓ ఫ్లీచ్ మన్ ఈ మేరకు ట్రంప్ కు విజ్ఞప్తి చేశారు. అమెరికాను బలోపేతం చేయాలని సిద్ధమైన ట్రంప్ వెంటనే ఆ పని మొదలు పెట్టండి. విదేశాలకు చెందిన నిపుణులైన మానవ వనరులను అమెరికాకు రప్పించుకునేందుకు సహకరించండి. అని ఓ పత్రికలో రాసిన ఎడిటోరియల్ లో విజ్ఞప్తి చేశారు.
అమెరికాను బోలపేతం చేస్తాననే కీలక హామీతో గద్దెనెక్కిన ట్రంప్ ఈ క్రమంలో కంపెనీలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఫ్లీచ్ మన్ కోరారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న హెచ్1బీ వీసా నిబంధనలు అడ్డుగా ఉన్నాయని వాటిని సవరించకపోతే ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. కొత్త నిపుణులను దేశీయ సంస్థలు పొందేందుకు ఇది సరైన సమయం అని ఫ్లీచ్ మన్ విశ్లేషించారు. అందుకే పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు.
ఇదిలాఉండగా విదేశీ ఔట్ సోర్సింగ్‌ల ఉద్యోగులే టాప్ వినియోగదారులుగా ఉన్నారని, తద్వారా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరగడానికి కారణంగా మారుతోందని ఆ దేశంలో పలువురు ఆందోళ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్-1బీ - ఎల్ 1 వీసాల విధానాన్ని కఠినతరం చేయాలంటూ సంయుక్త చట్టసభ సభ్యులు కొద్దికాలం క్రితం ప్రతిపాదించారు. అధికార, విపక్ష సభ్యులు హెచ్ 1 బీ - ఎల్ 1 సంస్కరణల బిల్లును సంయుక్తంగా ప్రవేశపెట్టడంతో ఈ బిల్లు ఆమోదం పొందుతుందని భావిస్తున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం- ఏదైనా కంపెనీ తమ ఉద్యోగుల్లో 50 కంటే ఎక్కువ మందిని, లేదంటే మొత్తం ఉద్యోగుల్లో సగం కంటే ఎక్కువ మందిని హెచ్-1బీ, లేదా ఎల్-1 వీసాదారులతో భర్తీ చేసుకోవడం కుదరదు. ఈ నేపథ్యంలో అమెరికాలో అత్యధిక ఆదాయన్ని పొందుతున్న గుండెల్లో గుబులు మొదలైంది. మరోవైపు హెచ్ 1బీ - ఎల్1 వీసాల్లోని కొన్ని కేటగిరీల వీసాల ఫీజులను కొద్దికాలం క్రితమే అమెరికా భారీగా పెంచింది. డిసెంబర్ 18 - 2015 తర్వాత హెచ్1బీలోని కొన్ని కేటగిరీల వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లు అదనంగా ఒక్కో వీసాకు $4000 డాలర్లు చెల్లించాలని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్(యూఎస్ సీఐఎస్) స్పష్టం చేసింది. ఈ మేరకు తన వెబ్ సైట్ లో ప్రకటించింది. అలాగే..ఎల్1ఏ, ఎల్2బీ దరఖాస్తుదారులు $4500 డాలర్లు అదనంగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ పెంపు సెప్టెంబర్ 30, 2025 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/