Begin typing your search above and press return to search.
ట్రంప్ తలకు తుపాకీ గురిపెడితే ఏమవుతుంది?
By: Tupaki Desk | 16 March 2017 9:54 AM GMTప్రముఖ అమెరికన్ ర్యాపర్ స్నూప్ డాగ్ ను డొనాల్డ్ ట్రంప్ జైలుకెళ్తావంటూ పరోక్షంగా హెచ్చరించారు. తనపై అనుచిత రీతిలో వీడియో సాంగ్ ను చేసిన స్నూప్ డాగ్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేస్తూ.. ఆయన జైలుకెళ్లే సమయం దగ్గరపడిందని అన్నారు. ఇంతకీ అసలు కథేంటంటే... మూడో రోజుల కిందట స్నూప్ డాగ్ విడుదల చేసిన ఓ వీడియో సాంగ్ లో ట్రంప్ అవతారంలో ఉన్న వ్యక్తిని నకిలీ తుపాకీతో కాలుస్తున్నట్టు చూపించారు. 'లావెండర్' పేరుతో రూపొందించిన ఈ మ్యూజిక్ వీడియోలో అమెరికాలో పోలీసుల క్రూరత్వాన్ని - ట్రంప్ తీరును ఎండగట్టారు. ఇందులో అధ్యక్షుడిని రొనాల్డ్ క్లంప్ అంటూ పరోక్షంగా ట్రంప్ తీరును పరిహసించారు.
దీంతో ట్రంప్ కు కోపం కట్టలు తెంచుకుంది. 'స్నూప్ డాగ్ గతంలో ఇదేవిధంగా అధ్యక్షుడు ఒబామాకు గురిపెట్టి తుపాకీ కాలిస్తే ఏమయ్యేదో తెలుసా? జైలుకు వెళ్లాల్సిన సమయం' అంటూ పరోక్షంగా గాయకుడిని హెచ్చరించారు. ట్రంప్ తరఫు లాయర్లు సైతం ఈ మ్యూజిక్ వీడియోపై స్పందించారు. స్నూప్ డాగ్ వెంటనే అధ్యక్షుడు ట్రంప్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ఓ అధ్యక్షుడి గురించి ఇటువంటి వీడియోలు చిత్రీకరించడం ఎంత వరకు సబబు అంటూ అమెరికాలో చర్చ మొదలైంది. ట్రంప్ ను వ్యతిరేకిస్తున్నవారు కూడా స్నూప్ డాగ్ వీడియోకు మద్దతు పలకడం లేదు.
అయితే.. స్నూప్ డాగ్ వాదన వేరేగా ఉంది. ఈ పాటను వివాదాస్పదం చేయాలనుకోలేదని.. నోరు తెరిచి తమ బాధను చెప్పుకోలేని అమెరికా ప్రజల కోసమే ఇలా చేశానని స్నూప్ డాగ్ అంటున్నాడు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారిపోయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/