Begin typing your search above and press return to search.

ట్రంప్ స్టైల్ మారిపోయింది

By:  Tupaki Desk   |   10 Dec 2016 5:59 AM GMT
ట్రంప్ స్టైల్ మారిపోయింది
X
విదేశాంగ నీతికి భిన్నంగా తైవాన్ ప్రెసిడెంట్ సాయ్ ఇంగ్ వెన్‌ తో ఫోన్లో మాట్లాడి చైనా ఆగ్రహానికి గురైన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి తమ రాయబారిని నియమించే విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకున్నారు. జనవరిలో తాను ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో యూఎస్ రాయబారిగా చైనాకు పాత మిత్రుడైన టెర్రీ బ్రాన్‌స్టడ్‌ను నియమించారు. త‌ద్వ‌రా చైనాను కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. కాగా..అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ట్రంప్ తైవాన్ అధ్యక్షురాలు కు ఫోన్ చేసిన నేపథ్యం లో చైనా విషయంలో ఎలా వ్యవహరించబోతున్నారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఒబామా లా వైరినే కొనసాగిస్తారా..? లేక రష్యా మాదిరిగానే, చైనా విషయంలోనూ సానుకూలత ప్రదర్శిస్తారా..? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

మ‌రోవైపు ప్రపంచ పెద్దన్నగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడి సాయుధ సంపత్తిలో ఆయన అధికార విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌కు ఎనలేని ప్రాముఖ్యత ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ట్రంప్ త‌న‌దైన శైలిలో కొత్త విమానంపై నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రస్తుతం వాడుకలోనున్న విమానం పాతది కావడంతో ఒబామా ప్రభుత్వం కొత్త విమానాన్ని తయారుచేసేందుకు బోయింగ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్న ట్రంప్ మాత్రం కొత్త విమానంపై విముఖతతో ఉన్నారు. ఇందుకు కారణం ఒబామా ప్రభుత్వం కొత్త విమానం కోసం భారీగా డబ్బు వెచ్చిస్తుండమే! "బోయింగ్‌నుంచి కొత్త విమానం కొనుగోలు చేయడం మంచిదే. ఆ కంపెనీకి లాభాలు రావాలని నేను కూడా కోరుకొంటున్నాను. కానీ, మరీ ఇంతగా మాత్రం కాదు" అని ట్రంప్ ట్వీట్ చేశారు. విమానాలకు 4 బిలియన్లు చెల్లించడం వృథా అని ట్రంప్ వ్యాఖ్యానించారు.