Begin typing your search above and press return to search.
ట్రంప్ ప్రమాణ స్వీకారంలో 35 పదాలే
By: Tupaki Desk | 20 Jan 2017 4:36 PM GMTఅమెరికా 45వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరికాసేపట్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. భారత కాలమాన ప్రకారం శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అదిష్టించనున్నారు. అగ్రరాజ్యం అధిపతిగా ప్రమాణ స్వీకారం చేయడంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే 35 పదాలతోనే ట్రంప్ ప్రమాణస్వీకారం ముగియనుంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి బరాక్ ఒబామా, యూఎస్ కాంగ్రెస్ సభ్యులతో పాటు సుప్రీంకోర్టు జడ్జిలు హాజరుకానున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.
ఇదిలాఉండగా అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు వదులుకునే సమయంలో ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికన్లకు భరోసా ఇచ్చారు. దేశ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లు ఉండబోవని అమెరికన్లకు భరోసా కల్పించారు. జాతి వివక్ష, మీడియా స్వేచ్ఛపై దాడి, యువ ఇమ్మిగ్రెంట్ల పట్ల అమెరికా అనుసరిస్తున్న మౌలిక సూత్రాలు, విలువలను పరిరక్షించాలని ఈ సందర్భంగా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కు సూచించారు. జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు మెరుగైన సలహాలు ఇచ్చినట్లు ఒబామా తెలిపారు. తమ మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయన్నారు. అమెరికాలో పరిస్థితులు సజావుగానే ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/