Begin typing your search above and press return to search.
వామ్మో...ట్రంప్ కూ బీజేపీ సభ్యత్వం ఇచ్చేశారే
By: Tupaki Desk | 24 Sep 2019 4:59 AM GMTకేంద్రంలో వరుసగా రెండో పర్యాయం క్లిస్టర్ క్లియర్ మెజారిటీతో అధికారం దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ మాంచి ఊపు మీద ఉందనే చెప్పాలి. తొలి సారి అధికారం దక్కించుకున్న తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... పాలనా సంస్కరణలపై దృష్టి సారించారనే చెప్పాలి. పార్టీ విస్తరణపైనా మోదీ దృష్టి సారించినా... అంత దూకుడుగా వెళ్లలేదనే చెప్పాలి. అయితే రెండో పర్యాయం అధికారం దక్కించుకున్న తర్వాత మోదీ పాలనపై కంటే కూడా పార్టీ విస్తరణతో పాటుగా తనకు మింగుడు పడని పార్టీలపైనా - బీజేపీకి అధికారం దక్కని రాష్ట్రాలపైనా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇటు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తన సన్నిహితుడు అమిత్ షానే నియమించుకున్న మోదీ... షాకు తోడుగా మరో మాజీ కేంద్ర మంత్రి జేపీ నద్దాను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించుకుని ఈ దిశగా దూకుడు పెంచేశారు. వెరసి ఇప్పుడు ఎక్కడ చూసినా బీజేపీ దూకుడు తత్వంపైనే చర్చలు జరుగుతున్న పరిస్థితి.
ఇలాంటి కీలక సమయంలో మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం - అక్కడ హౌడీ మోదీ పేరిట ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం - ఆ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కావడం - ఈ సందర్భంగా సభకు వచ్చిన అశేష ఎన్నారై సమాజాన్ని చూసి మరింత ఉత్సాహంగా కనిపించిన మోదీ... ట్రంప్ చేయి పట్టుకుని ఎన్నారైల వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ట్రంప్ చేయి పట్టుకున్న మోదీ... అమెరికా అధ్యక్షుడిని ఏకంగా లాక్కెళుతున్నట్లుగా కనిపించిన దృశ్యాలు నిజంగానే వైరల్ అయ్యాయి. అంతేకాకుండా హౌడీ మోదీ సభకు హాజరైన ఎన్నారై జనసంద్రాన్ని చూసిన మోదీ... ప్రపంచంలోనే తన స్థాయికి తగ్గ నేత ఎవరూ లేరన్న కోణంలోనూ ఓ రేంజి స్పీచ్ ను వదిలారు.
మరి ఈ స్పీచ్చో - లేదంటే... మోదీ చేతిలో చేయి వేసి ఆయనను అనుసరించడం మినహా గత్యంతరం లేదన్నట్లుగా నడిచిన ట్రంప్ తీరో తెలియదు గానీ.. ట్రంప్ ను కూడా కాషాయం పార్టీలోకి చేర్చేశారన్న కోణంలో సోషల్ మీడియాలో ఓ వైరల్ పోస్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఈ పోస్ట్ లో ఏముందంటే... ట్రంప్ కూడా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారట. ఈ మేరకు ట్రంప్ పేరిట ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం జారీ చేసిన గుర్తింపు కార్డును సదరు పోస్ట్ లో పెట్టేశారు. ఈ పోస్ట్ ను చూసిన వారంతా ముక్కున వేసుకోగా.. కాస్తంత తేరుకున్న తర్వాత ఈ ట్రంప్... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాదులే... హిందూస్థాన్ ట్రంప్ అంటూ ఓ రేంజిలో సెటైర్లు పడిపోతున్నాయి. మోదీ అమెరికా పర్యటన పుణ్యమా? అని ఇప్పుడు ట్రంప్ కూడా బీజేపీ నేతగా మారిపోయారే అని కూడా కొందరు కామెంట్లు పెడుతున్నారు.