Begin typing your search above and press return to search.
గోడ కట్టడంతో పాటు ఇంకో స్కెచ్ వేసిన ట్రంప్
By: Tupaki Desk | 24 Jun 2017 3:57 PM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల్లో ఎంత భిన్నత్వం ఉంటుందో తెలియజెప్పేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా అలాంటిదే మరో వార్త తెరమీదకు వచ్చింది. మెక్సికో-అమెరికా సరిహద్దుల్లో గోడ కట్టాలని నిర్ణయించిన అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనికి మరో ప్రతిపాదన తెచ్చారు. కొత్తగా నిర్మించబోయే ఈ గోడపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పారు.
అమెరికా ఎన్నికల ప్రచారంలోనే తాను అధ్యక్షుడిని అయితే అమెరికా-మెక్సికో మధ్య గోడ నిర్మిస్తానని ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకారం గోడ నిర్మాణం విషయంలో పట్టుదలతో ఉన్న ట్రంప్ ఎంత ఖర్చైనా గోడ నిర్మించాలని భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కలిసివచ్చే అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ గోడపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా ఇటు గోడ నిర్మాణం అటు దేశీయ విద్యుత్ అవసరాలు తీర్చడమనే ప్రణాళికకు ట్రంప్ స్కెచ్ వేశారని అంటున్నారు.
మరోవైపు ట్రంప్ ఆలోచనను పలువురు భిన్నమైన కోణంలో విశ్లేషిస్తున్నారు. మెక్సికో గోడకు పెద్ద ఎత్తున అయ్యే ఖర్చు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందనే నెగెటివ్ ప్రచారం తనను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. వేల కోట్ల రూపాయలు గోడకు ఖర్చు చేసినప్పటికీ అటు రక్షణతో పాటు ఇటు విద్యుత్ అవసరాలను తీర్చగలుగుతున్నారనే భావనను కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/