Begin typing your search above and press return to search.
అగ్రరాజ్యపు అధ్యక్షుడు జోబైడెన్ కు చివరి సీటు..ట్రంప్ సెటైర్
By: Tupaki Desk | 20 Sep 2022 4:44 PM GMTబ్రిటన్ మహారాణి దివంగత క్వీన్ ఎలిజిబెత్ అంత్యక్రియల్లో ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికా అధ్యక్షుడికి ఘోర అవమానం జరిగిందని ప్రత్యర్థులు ఆడిపోసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడిని ఎలిజిబెత్ అంత్యక్రియలలో ప్రాధాన్యత లేనట్టు వెనుక వరుసలా కూర్చోబెట్టడం ఇప్పుడు వివాదమైంది. జో బిడెన్ కూర్చున్న స్థానం గురించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగతాళి చేశారు.
అధ్యక్షుడు జో బిడెన్ బ్రిటన్ లోని క్వీన్ అంత్యక్రియలు నిర్వహిస్తున్న వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బే భవనంలో వెనుక నుండి ఏడు సీట్లో కూర్చుండబెట్టారు. మొత్తం 14 వరుసలు కాగా.. జోబైడెన్ ను మొదటి ముదు వరుసలో కాకుండా 7వ వరుసలో కూర్చోబెట్టడం.. అది ప్రాధాన్యం లేనట్టు గుంపులో గోవిందయ్యాలా సీటు కేటాయించడమే వివాదమైంది.
అమెరికా అధ్యక్షుడికి బ్రిటన్ రాణి అంత్యక్రియల్లో ఇలా ప్రాధాన్యత దక్కకపోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెటైర్లు వేశాడు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో బైడెన్ ను చివరలో కూర్చుండబెట్టిన ఫొటోను షేర్ చేశాడు. ప్రపంచ నాయకుల ఫోటోల్లో బైడెన్ స్థానం ఇదీ అంటూ సెటైరికల్ గా రాసుకొచ్చాడు. ‘‘తాను ఇంకా అధ్యక్ష పదవిలో ఉండి ఉంటే మన అమెరికా స్థానం ముందుకు కూర్చునేవాడినని.. ఇలా గుంపులో గోవిందయ్యాల కూర్చునేంత ఖర్మ అమెరికాకు పట్టేది కాదని’ బైడెన్ ను ఉద్దేశిస్తూ నిలదీశారు.
మిస్టర్ బిడెన్ అధ్యక్షుడైనప్పటి నుండి ప్రపంచంలో యునైటెడ్ స్టేట్స్ యొక్క స్థానం పడిపోయిందనడానికి ఇది సంకేతమని ట్రంప్ ఎద్దేవా చేశారు. "ఇది కేవలం రెండు సంవత్సరాలలో అమెరికాకు జరిగింది. ప్రపంచ దేశాల్లో అమెరికాకు గౌరవం లేకుండా పోయింది’ అంటూ ట్రంప్ దెప్పిపొడిచాడు. "కొన్ని మూడవ ప్రపంచ దేశాల నాయకులను తెలుసుకోవడానికి మా అధ్యక్షుడికి మంచి సమయం." అంటూ ట్రంప్ సెటైర్ వేశారు. "నేను అధ్యక్షుడిగా ఉంటే, వారు నన్ను అక్కడ కూర్చోబెట్టరు. మన దేశం ప్రస్తుతం ఉన్నదానికంటే చాలా భిన్నంగా ఉంటుంది!’ అంటూ ట్రంప్ పేర్కొన్నాడు. రియల్ ఎస్టేట్ అయినా..రాజకీయాలైనా.. జీవితమైనా.. లోకేషన్ అనేది చాలా ముఖ్యం అంటూ బైడెన్ ను ట్రంప్ విమర్శించారు.
పోలండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా వెనుక బిడెన్స్ కూర్చున్నారు. ప్రోటోకాల్ కారణంగా కామన్వెల్త్ నాయకులను ఇతర అగ్ర దేశాలకు చెందిన అధ్యక్షుల కంటే ముందు కూర్చోబెట్టారు. అంటే కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.. అమెరికా అధ్యక్షుడి ముందు తొమ్మిది వరుసలలో ఉన్నారు.
అధ్యక్షుడు జోబిడెన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బిడెన్ స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ ఇగ్నాజియో కాసిస్ పక్కన కూర్చున్నారు. బిడెన్స్‌కు ఎదురుగా పోలండ్ ప్రెసిడెంట్ ఆండ్రెజ్ డుడా ఉన్నారు. వారి వెనుక చెక్ ప్రధాన మంత్రి పీటర్ ఫియాలా ఉన్నారు.
చైనా ప్రతినిధి, వైస్ ప్రెసిడెంట్ వాంగ్ కిషన్, బిడెన్స్ ఉన్న వరుసలో కూర్చున్నారు. ట్రంప్ "మూడవ ప్రపంచ దేశాల" గురించి ప్రస్తావించినప్పుడు ఏ నాయకులను ఉద్దేశించి అన్నాడో అస్పష్టంగా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.