Begin typing your search above and press return to search.

ట్రంప్ ఆయన్ను చంపేస్తాడా?

By:  Tupaki Desk   |   8 April 2017 10:38 AM GMT
ట్రంప్ ఆయన్ను చంపేస్తాడా?
X
అమెరికాలో అధ్యక్షులు మారినా పద్ధతులు మారవు. తమకు నచ్చనివారిని ఎలాగోలా అంతం చేయడమే వారి లక్ష్యం. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను చంపినట్లే ఇప్పుడు ఆ పొరుగునే ఉన్న సిరియా అధ్యక్షుడు బసర్ అల్ అసద్ నూ చంపాలని అమెరికా ప్రయత్నిస్తోంది. తాజాగా అమెరికా పద్ధతి... సిరియాలో పరిణామాలు చూస్తుంటే అమెరికా అసద్ ప్రాణాలపై కన్నేసిందని అర్థమవుతోంది. 2003లో బ్రిటన్‌, అమెరికాలు కలిసి ఇరాక్‌పై దాడి జరిపినట్లుగానే ఇప్పుడు సిరియాపై దాడి ప్రారంభమైందని అంతర్జాతీయ సమాజం అంటోంది.

2013 ఆగస్టులో అస్సాద్‌ ప్రభుత్వం డమాస్కస్‌ నగరానికి తూర్పున గల గౌదా ప్రాంతంలో వెయ్యి మంది దేశ పౌరులను రసాయనాలతో చంపిందని ఒబామా ప్రభుత్వం ప్రచారం చేసి ఇప్పటి వరకూ నిరూపించలేకపోయింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ సైమూర్‌ హెర్ష్‌ పరిశీలించి అల్‌-నుస్సా విషవాయువులను తయారుజేస్తోందని వెల్లడిం చినా ఇంతవరకూ అమెరికా పట్టించుకోలేదు. 2011లో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్న ఆరు సంవత్సరాల సిరియా యుద్ధంలో మొట్టమొదటిసారిగా రష్యా, టర్కీల మధ్యవర్తిత్వంతో సిరియా శాంతి చర్చలు కజకిస్తాన్‌ రాజధాని అస్థానాలో జనవరి చివరిలో జరిగాయి. ఈ చర్చల్లో ఇరాన్‌ కూడా కీలక పాత్ర పోషించింది. అమెరికా ఆఖరి నిమిషంలో నామమాత్రపు ఆహ్వానం దక్కించుకొంది. సిరియా ప్రభుత్వం ఒకవైపు, తిరుగుబాటుదారులు, ప్రతిపక్షాలు మరొకవైపు కూర్చొని చర్చించుకోవడం అదే ప్రథమం. నిర్ణయాత్మక ఒప్పందాలు జరగనప్పటికీ కాల్పుల విరమణకు రష్యా, టర్కీ, ఇరాన్‌ల ఎదుట ఇరుపక్షాలూ అంగీకరించాయి.

అలెప్పో నగరంలో సిరియా ప్రభుత్వ సేనలు ఇస్లామిక్‌ సేనలను తరిమివేసి నగరాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొన్న నేపథ్యంలో ఇస్లామిక్‌ స్టేట్‌ బలహీనపడి 2015 సెప్టెంబరు 30 నుంచి రష్యా యుద్ధ విమానాలు రంగ ప్రవేశంతో టెర్రరిజం బలహీనపడుతూ వచ్చింది. అస్థానా చర్చల అనం తరం జెనీవాలో శాంతి చర్చలు కొనసాగాయి. ఇదంతా అమెరికాకు నచ్చలేదు. రష్యా మధ్యవర్తిత్వంతో ఒక పెద్ద సమస్య పరిష్కారం అయ్యే దశకు రావడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోయింది.

ఈ నేపథ్యంలోనే రసాయన దాడుల నెపంతో సిరియాపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. నిజానికి సామాన్య పౌరులపై రసాయన దాడులను ప్రయోగిం చింది సామ్రాజ్యవాదమే.

* మొదటి ప్రపంచయుద్ధ సమయం లో జర్మనీ 1915 ఏప్రిల్‌లో బెల్జియంలోని యెప్సెస్‌లో క్లోరిన్‌ గ్యాస్‌ ప్రయోగించగా తొమ్మిది లక్షల మంది మరణించారు. లక్షలాదిమంది గాయపడ్డారు.

* మొదటి ప్రపంచయుద్ధం జెనీవా కమిటీ 1925లో అంతర్జాతీయ అంతర్యుద్ధాల్లో రసా యనాలు వాడకూడదని నిషేధించినా రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ గ్యాస్‌ ఛాంబర్స్‌లో పెట్టి వేలాదిమంది హతమార్చా డు.

* వియత్నాం యుద్ధంలో అమెరికన్లు 1962-1971 మధ్య రసాయన వాయువులను వాడి అడవులను, పంటలను ధ్వంసంచేసి, లక్షలాది మందిని చంపారు.

* హిరోషిమా - నాగసాకీల్లో 1945 ఆగస్టు 6 - 9 తేదీల్లో మానవజాతిపై మొదటిసారిగా అణుబాంబులు ప్రయోగించి రెండున్నర లక్షల ప్రాణాలను అక్కడిక్కడే హరించిన చరిత్ర సామ్రాజ్యవాదానిదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/