Begin typing your search above and press return to search.

అమెరిక‌న్ల విష‌యంలో ట్రంప్ వెన‌క్కు త‌గ్గాడుగా

By:  Tupaki Desk   |   27 Jan 2018 5:20 AM GMT
అమెరిక‌న్ల విష‌యంలో ట్రంప్ వెన‌క్కు త‌గ్గాడుగా
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస‌క్తిక‌ర - ఇంకా చెప్పాలంటే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ్లోబ‌లైజేష‌న్ జ‌మానాలో స్వేచ్ఛా వాణిజ్యం పెద్ద ఎత్తున సాగుతున్న‌ప్ప‌టికీ అమెరిక‌న్లు మాత్ర‌మే అంటూ నిన‌దించి - అమ‌లు చేస్తున్న ట్రంప్ వెన‌క్కు త‌గ్గారు. తాను స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతునిస్తానని పేర్కొన్నారు. అయితే అది నిష్పక్షపాతంగా - పరస్పరం ప్రయోజనకారిగా ఉండాలని పేర్కొన్నారు. దావోస్‌ లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమెరికన్ ఫస్ట్ పాలసీ అంటే అమెరికన్లు మాత్రమే అని కాదని వివరణ ఇచ్చారు.

ఈ స‌ద‌స్సు సంద‌ర్భంగా ఇతర దేశాల అధినేతలు.. ట్రంప్ రక్షణాత్మక విధానాలపై దాడి చేయడంతో ఆయన వెనుకకు తగ్గారు. అమెరికాలో వ్యాపారానికి ద్వారాలు తెరిచే ఉన్నాయన్న ట్రంప్.. అయితే అది పోటీ తత్వం కలిగి ఉండాలన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ ను ఉగ్రవాదులకు స్వర్గధామంగా తిరిగి మారనివ్వబోమని స్పష్టం చేశారు. అమెరికా - తన నిర్ణయాలపై ప్రస్తావించిన ట్రంప్.. `అధ్యక్ష ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ పలుసార్లు తన రికార్డులను తిరుగరాసింది. ఏడు లక్షల కోట్ల డాలర్లకుపైగా నూతన ఆదాయం సృష్టించింది` అని చెప్పారు. అమెరికాలో పెట్టుబడులు - ఉద్యోగాలు - వ్యాపారాలకు ప్రస్తుతం సరైన సమయం అని చెప్పారు. నూతన పన్ను విధానంతోపాటు తన ప్రభుత్వ విధానాలను సవివరంగా వివరించిన ట్రంప్ దేవుడు మీ అందరినీ దీవించుగాక అని ప్రసంగాన్ని ముగించారు.ఈ సంద‌ర్భంగా ట్రంప్ ఎప్ప‌ట్లాగే మీడియాపై ఘాటుగా రియాక్ట‌య్యారు. తాను ఒక వ్యాపార వేత్తగా మీడియా ప్రేమికుడినని ట్రంప్ చెప్పారు. కానీ తాను రాజకీయవేత్తగా మారగానే తనకు వ్యతిరేకంగా మీడియా బూటకపు వార్తలు వెలువరించిందన్నారు. బిల్ క్లింటన్ తర్వాత డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరైన రెండో అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కావడం గమనార్హం.

కాగా, ఆఫ్రికన్లు మురికివారని ట్రంప్.. వ్యాఖ్యానించినందుకు ఆఫ్రికా దేశాల అధినేతలు - ప్రతినిధులు వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరంలో ప్రసంగాన్ని బహిష్కరించారు. కాగా, ఈ సందర్భంగా కార్పొరేట్ సీఈవోలకు ఇచ్చిన ట్రంప్ విందుకు భారత సంతతికి చెందిన ముగ్గురు సీఈవోలతోపాటు 16 మంది ఈయూ సంతతి సీఈవోలు హాజరయ్యారు. నొవార్టీస్ సీఈవో వ్యాస్ నరసింహన్ - నోకియా సీఈవో రాజీవ్ సూరి - డెల్లాయిట్ సీఈవో పునీత్ రెంజెన్ విందులో పాల్గొన్నారు.