Begin typing your search above and press return to search.
ట్రంప్ కు కరోనా టెస్ట్.. ఏం తేలిందంటే?
By: Tupaki Desk | 15 March 2020 4:34 AM GMTచైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు పాకిన కరోనా వైరస్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను కూడా బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే 50 మంది కరోనా వైరస్ కు అమెరికాలో బలి అయ్యారు. ఏకంగా 2329 కేసులు నమోదయ్యాయి.
దీంతో అప్రమత్తమైన ట్రంప్ సర్కార్ నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్య శాఖకు ప్రత్యేక అధికారులు ఇచ్చారు. రాష్ట్రాలు ఎక్కువ నిధులు ఖర్చు చేసేందుకు 50 బిలియన్ డాలర్లను కేటాయించారు.కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని దేశాలతో కలిసి పనిచేస్తామని ట్రంప్ ప్రకటించారు.
అమెరికాలో కరోనా కారణంగా తాజాగా ఒక్కరోజే ఏడుగురు మరణించారు. మృతుల సంఖ్య ఏకంగా 50దాటింది. కొత్తగా 500పైగా కేసులు నమోదయ్యాయి. దాంతో కేసుల సంఖ్య 3వేలకు చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే 2009లో అమెరికాలో స్వైన్ ఫ్లూ తర్వాత మరో హెల్త్ ఎమర్జెన్సీ ని ట్రంప్ తాజాగా ప్రకటించారు.
అయితే కరోనా భయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కూడా పట్టుకుంది. గత వారం బ్రెజిలియన్ అధికారులతో ట్రంప్ భేటి అయ్యారు. ఈ భేటిలో ఓ వ్యక్తి ట్రంప్ కు షేక్ హ్యాండిచ్చారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ట్రంప్ కు అత్యవసరంగా అమెరికా వైద్యశాఖ అధికారులు టెస్టులు నిర్వహించారు.
ఈ టెస్టుల్లో ట్రంప్ కు కరోనా నెగెటివ్ అని తేలింది. నార్మల్ గా ఉన్నట్టు వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికాలో కూడా స్కూల్స్, స్పోర్ట్ ఈవెంట్స్ - కల్చరల్ - ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు రద్దు చేశారు. యూకే సహా అన్ని దేశాల రాకపోకలపై నిషేధం విధించారు.