Begin typing your search above and press return to search.
ట్రంప్ మనల్ని మెచ్చుకున్నాడు తెలుసా?
By: Tupaki Desk | 18 Dec 2016 10:00 AM GMTడొనాల్డ్ ట్రంప్ అమెరికా కాబోయే అధ్యక్షుడు. అగ్రరాజ్యం అధిపతిగా పోటీ పడుతున్నప్పటికీ ట్రంప్ నోరు తెరుస్తున్నారంటే అంతా భయపడాల్సిందే. అలాంటి ట్రంప్ భారతీయులను మెచ్చుకున్నారు. నిజంగా నిజం. ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ‘కృతజ్ఞత రాలీ’కి హాజరైన వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ, అమెరికాలోని అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను విజయం సాధించడం వెనుక ఇండో-అమెరికన్లు కూడా గణనీయమైన పాత్ర పోషించారని అంగీకరించారు. తన విజయానికి హిందువులు ఎంతగానో కృషి చేశారని, ఇప్పుడు వారంతా ఈ ర్యాలీలో తనవెంటే ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ట్రంప్ కీలక రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాలో కూడా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఫ్లోరిడా ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు ట్రంప్ నిర్వహించిన ర్యాలీకి ప్రవాస భారతీయులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను సాధించిన చరిత్రాత్మక విజయం వెనుక ఇండో-అమెరికన్లు, ప్రత్యేకించి హిందువుల పాత్ర కూడా ఉందని ట్రంప్ అంగీకరించడం ఇదే తొలిసారి.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కాబోయే అధ్యకుడు ట్రంప్ కు హితబోధ చేశారు. మరే దేశాల ఇతర సంబంధాలతో పోల్చి చూసినట్లైతే అమెరికా-చైనా ద్వైపాక్షిక సంబంధాలకు విశేష ప్రాధాన్యత వుందని వ్యాఖ్యానించారు. అమెరికా-చైనా సంబంధాలు దెబ్బతింటే ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడతారని అన్నారు. '' ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ, జాతీయ భద్రతల దృష్ట్యా చూసినట్లైతే అమెరికా, చైనాల మధ్య సంబంధాలకు చాలా ప్రాధాన్యత వుందని అంతర్జాతీయ వ్యవహారాల్లో చైనా ప్రాధాన్యత పెరుగుతోందని'' ఒబామా పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ నెల ప్రారంభంలో తైవాన్ అధ్యక్షురాలు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ఒకే చైనా విధానం కాలానుగుణ్యతను ట్రంప్ ప్రశ్నించారు. ఆ నేపథ్యంలో అమెరికా ఒకే చైనా విధానానికి కట్టుబడి వుందంటూ అనేక సందర్భాల్లో వైట్‌హౌస్ స్పష్టం చేసింది. ఇలా ఒకింత గందరగోళ వాతావరణం నెలకొన్న క్రమంలో ఒబామా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/