Begin typing your search above and press return to search.
ట్రంప్ ఆర్డర్ః వీసా దరఖాస్తులను టార్గెట్ చేయండి
By: Tupaki Desk | 27 March 2017 7:28 AM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలపై మరింత దూకుడు పెంచుతున్నారు. అమెరికా వీసాకు దరఖాస్తు చేయడమే ఆలస్యం అన్నట్లుగా సంబంధిత వ్యక్తి వివరాలన్నింటినీ ఆరా తీసేందుకు స్కెచ్ గీశారు. ఇందుకోసం కొత్త ఆర్డర్ జారీ చేశారు. వీసాలు జారీ చేసేందుకు అనుసరించే తనిఖీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని, అదనపు స్క్రూటినీ చేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన దౌత్య కార్యాలయాలను ఆదేశించింది. టూరిస్టు - బిజినెస్ వీసాలతో పాటుగా అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారినందరినీ గత 15 ఏళ్లుగా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, నివాసం ఉంటున్నారు లాంటి వివరాలతో పాటుగా గత అయిదేళ్లుగా వారు ఉపయోగించిన ఫోన్ నంబర్ల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్ సన్ దౌత్య కార్యాలయాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆరు ముస్లిం దేశాలకు చెందిన వారు అమెరికాలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధిస్తూ సవరించిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన తర్వాతి దశ అన్నట్లుగా వీసాల నిబంధనలను సవరిస్తూ ఈ సమాచారాన్ని పంపించారు. హింసాత్మక - నేరపూరిత - లేదా ఉగ్రవాద చర్యలను సమర్థించే లేదా అలాంటి చర్యలకు పాల్పడే విదేశీయులు అమెరికాలోకి ప్రవేశించకుండా చూడడం కోసం, అలాగే అమెరికాలోకి రావడానికి అనుమతించిన వారిని నిశిత పరిశీలన చేయడం కోసం ఈ అదనపు ప్రోటోకాల్స్‌ను ప్రవేశపెట్టడం జరిగిందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విదేశీయులకు వీసాలు జారీ చేయడం కోసం నిశిత పరిశీలన జరపడానికి కొన్ని కొలమానాలను కూడా తక్షణం రూపొందించుకోవాలని కూడా దౌత్యాధికారులను ఆ ఉత్తర్వులో కోరారు.
ఇదిలాఉండగా...ఈ చర్య వల్ల భారతీయులపై ఏదయినా ప్రభావం ఉంటుందా అనే విషయం వెంటనే తెలియరాలేదు. అయితే ఈ చర్యల కారణంగా వీసాలు జారీ చేసే ప్రక్రియ జాప్యమయ్యే అవకాశముందని, దరఖాస్తులు పేరుకుపోవచ్చని అమెరికా ఇమిగ్రేషన్ లాయర్ల అసోసియేషన్ డైరెక్టర్ గ్రెగ్ చాన్ తెలిపారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/