Begin typing your search above and press return to search.

ట్రంప్ నిర్ణ‌యాన్ని త‌ప్ప‌కుండా అభినందించాల్సిందే

By:  Tupaki Desk   |   14 March 2017 4:47 PM GMT
ట్రంప్ నిర్ణ‌యాన్ని త‌ప్ప‌కుండా అభినందించాల్సిందే
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే మ‌న‌కు ఉన్న దుర‌భిప్రాయాన్ని కాస్త దూరం చేసుకోవాల్సిందే. అదే స‌మ‌యంలో ఆయ‌న‌లోని గొప్ప మ‌న‌సును ప్ర‌శంసించ‌కుండా ఉండలేము కూడా. ఇన్నాళ్లు చెడ్డ‌(!) వార్తల ద్వారా ప్రపంచం దృష్టిని త‌న‌వైపు తిప్పుకున్న ట్రంప్ ఇపుడు త‌న పెద్ద మ‌న‌సుతో అంద‌రి మ‌న‌సుల‌ను గెలుచుకున్నారు. అంత గొప్ప ప‌ని ట్రంప్ ఏం చేశార‌నే క‌దా మీ సందేహం... ఆ విష‌యానికే వ‌స్తున్నాం. అమెరికా అధ్య‌క్షుడికి ఏటా 4,00,000 అమెరిక‌న్ డాల‌ర్ల జీతం వ‌స్తుంటుంది. ఈ జీతం మొత్తాన్ని ఆయ‌న సేవా సంస్థ‌ల‌కు ఇచ్చేస్తున్న‌ట్లు నిర్ణ‌యించారు. ఈ ఏడాదిలో ట్రంప్ ఈ మేర‌కు 4ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను ఇచ్చేయ‌నున్న‌ట్లు వైట్ హౌస్ అధికార ప్ర‌తినిధి సీన్ స్పైస‌ర్ వెల్ల‌డించారు. అమెరిక‌న్ల కోస‌మే తానున్నాన‌ని చెప్పిన మాట‌ను ఈ సంద‌ర్భంగా స్పైస‌ర్ గుర్తు చేశారు.

అయితే, ఆయ‌న ఇంటికి ఏడాదిలో ఒక్క డాల‌ర్ మాత్ర‌మే తీసుకుపోనున్నారు. ఇది కూడా ఎందుకు అంటే...అమెరికా నిబంధ‌న‌ల ప్ర‌కారం అధ్య‌క్షుడు ఒక్క డాల‌ర్‌ను త‌ప్ప‌నిస‌రి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ విత‌ర‌ణ నేప‌థ్యంలో వైట్ హౌస్ అధికార ప్ర‌తినిధి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన సూచ‌న కూడా చేశారు. ఇక‌నుంచి మీడియా, విలేక‌రులు ఈ నిధులు ఏ రూపంలో ఖ‌ర్చు అవుతున్నాయో దృష్టి పెట్టాల‌ని త‌ద్వారా అవి ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ఉంటాయ‌ని పేర్కొన్నారు.

రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో బిలియ‌న్ డాల‌ర్లు సంపాదించిన ట్రంప్ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నిక‌యిన త‌ర్వాత‌ ఒక్క డాల‌ర్‌ను సైతం త‌న ఇంటికి తీసుకుపోన‌ని ఆయ‌న తేల్చిచెప్పారు. అనుకున్న‌ట్లుగానే ఇప్పుడు ఆ మొత్తాన్ని విత‌ర‌ణ చేస్తున్నారు. అమెరికా అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన స‌మ‌యంలో హెర్బ‌ర్ట్ హూవ‌ర్‌, జాన్ ఎఫ్ కెనడీ మాత్ర‌మే ఈ రూప‌లో త‌మ వేత‌నాన్ని సేవా సంస్థ‌ల‌కు ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/