Begin typing your search above and press return to search.
అమెరికాలో మధ్యంతర ఎన్నికలు.. పోటీలో ట్రంప్?
By: Tupaki Desk | 8 Nov 2022 4:30 PM GMTఅమెరికా అధ్యక్షుడి పదవీకాలం నాలుగేళ్లు ఉంటుంది. గత రెండేళ్ల క్రితం అధ్యక్ష పదవి కోసం జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ ఫైట్ నడిచింది. ఈ ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీ కాలం ఇప్పటికే రెండేళ్లు పూర్తయింది. దీంతో ఆయన పదవీ కాలం మరో రెండేళ్లు మాత్రమే ఉండనుంది.
కాగా అమెరికాలో కాంగ్రెస్ సంబంధించి ప్రతీ రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రతినిధుల సభ మరియు సెనేట్ లకు రెండేళ్లకోసారి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సెనేటర్లు ప్రతి రాష్ట్రానికి ఇద్దరు చొప్పున ఉంటారు. వీరి పదవీ కాలం ఆరేళ్లుగా నిర్ణయించబడింది.
అలాగే ప్రతినిధుల సభలోని ప్రజాప్రతినిధులకు రెండేళ్ల పదవీ కాలం ఉంటుంది. వీరంతా కూడా చిన్నచిన్న జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ నవంబర్ ప్రతినిధులు సభ మరియు సెనేట్లో మూడింట ఒక వంతు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు పలు రాష్ట్రాల్లోని గవర్నర్.. స్థానిక అధికారులకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి.
అధ్యక్ష ఎన్నికలకు మధ్యలో ఈ ఎన్నికలు రావడంతో వీటిని మధ్యంతర ఎన్నికలుగా పిలుస్తారు. ఈ ఎన్నికల ఫలితాలు జో బైడెన్ పాలన తీరుకు అద్ధంపట్టే అవకాశం ఉండనుంది. దీంతో ఈ ఎన్నికలు డెమొక్రాట్లు.. రిపబ్లికన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం కన్పిస్తోంది. రాబోయే ఎన్నికల ఫలితాలపై ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఉండే అవకాశముంది.
ఇప్పటి వరకు ప్రతినిధుల సభ మరియు సెనేట్ రెండింటిలోనూ డెమోక్రాట్ పార్టీకే మెజారిటీ ఉంది. దీంతో అధ్యక్షుడు జో బైడెన్‌కు తాను కోరుకున్న చట్టాలను సులువుగా ఆమోదించుకోగలిగారు. అయితే డెమోక్రాట్లు.. రిపబ్లికన్ల మధ్య తక్కువ మార్జిన్‌తో ఆధిక్యం ఉంది. ఈసారి ప్రతినిధుల సభను జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్లు.. సెనేట్లో డెమోక్రాట్లు పైచేయి సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ఒహైయోలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 15న ఫ్లోరిడాలో ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయన రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మూడోసారి కూడా అధ్యక్ష బరిలో నిలువాలని ట్రంప్ భావిస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అయితే మధ్యంతర ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు కూడా ట్రంప్ వేచిచూస్తే బాగుంటుందని రిపబ్లికన్లు ఆయనకు సలహా ఇస్తున్నారు. ట్రంప్ మాత్రం వీలైనంత త్వరగా అధ్యక్ష ఎన్నికలకు వెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకునేందుకే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.