Begin typing your search above and press return to search.

రెండోసారి అధ్య‌క్ష పోటీకి డిసైడ్ అయిన ట్రంప్!

By:  Tupaki Desk   |   2 Jun 2019 6:02 AM GMT
రెండోసారి అధ్య‌క్ష పోటీకి డిసైడ్ అయిన ట్రంప్!
X
ఎన్నో వివాదాలు.. మ‌రెన్నో సంచ‌ల‌నాల న‌డుమ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌ద‌వీ కాలం త్వ‌ర‌లో పూర్తి కానుంది. ఒక అమెరికా అధ్య‌క్షుడు ఎలా ఉండ‌కూడ‌దో.. అచ్చుగుద్దిన‌ట్లుగా ఉన్న‌ట్లుగా ప‌లువురు అభివ‌ర్ణించే ట్రంప్ దెబ్బ‌కు.. ఆయ‌న ప్ర‌తినిధ్యం వ‌హించిన రిప‌బ్లిక‌న్ పార్టీ సైతం నోట మాట రాని ప‌రిస్థితి.

ఏదో ఒక‌లా ట్రంప్ ప‌ద‌వీ కాలం పూర్తి అయితే పోతుందిలే పీడా అనుకున్న వారికి షాకిచ్చేలా ట్రంప్ తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. తాను అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి రిప‌బ్లిక్ పార్టీ త‌ర‌ఫున రెండోసారి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా వెల్ల‌డించారు.

తాను తీసుకున్న నిర్ణ‌యాన్ని అధికారికంగా ఈ నెల 18న ఫ్లోరిడా రాష్ట్రంలోని ఒర్లాండోలో జ‌రిగే మీటింగ్ లో ఆయ‌నీ విష‌యాన్ని ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు. 2016లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ట్రంప్ విజ‌యంలో ఫ్లోరిడా రాష్ట్రమే కీల‌కంగా మారింద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఆ సెంటిమెంట్ ను మ‌రోసారి రిపీట్ చేయాల‌ని ట్రంప్ భావిస్తున్నారు.

2020లో జ‌రిగే అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయాల‌ని ట్రంప్ డిసైడ్ అయ్యారు. త‌న మ‌ద్ద‌తుదారుల‌తో మాట్లాడే స‌మ‌యంలో త‌న ప‌ద‌వీ కాలం ఏడాదిన్న‌ర అన్న దానికి భిన్నంగా ఐదున్న‌రేళ్ల కాలంగా ఆయ‌నచెబుతుంటారు.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఏ నేత అయినా రెండుసార్ల‌కు మించి ఆ ప‌ద‌విని చేప‌ట్టే అవ‌కాశం ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో ఈ ట‌ర్మ్ కు తాను అధ్య‌క్షుడిగా ఉండాల‌ని ట్రంప్ డిసైడ్ అయిన‌ట్లుగా చెప్ప‌క‌త‌ప్ప‌దు. ట్రంప్ నిర్ణ‌యంపై రిప‌బ్లిక‌న్లు.. అమెరికా ప్ర‌జ‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.