Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా దిగ్గజాలకు షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్

By:  Tupaki Desk   |   9 Jan 2022 2:30 PM GMT
సోషల్ మీడియా దిగ్గజాలకు షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్
X
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే ఒక మొండి వాడు అంటారు. తనను ఎంత తొక్కాలనుకుంటే అంతగా షాకిస్తుంటాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఆయన మద్దతుదారులు చేసిన రచ్చ.. ఏకంగా అమెరికన్ కాంగ్రెస్ పై దాడి నేపథ్యంలో ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజాలు డొనాల్డ్ ట్రంప్ ను నిషేధించాయి. ఆయనకు వాయిస్ లేకుండా చేశాయి. అప్పటి నుంచి పగతో రగిలిపోతున్న ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనే సొంతంగా సోషల్ మీడియాను తయారు చేశాడు. ఇప్పుడు దాన్ని లాంఛ్ చేయడానికి తేడీ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.

డొనాల్డ్ ట్రంప్ ను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చేసిన రచ్చ సోషల్ మీడియా సంస్థలు బహిష్కరించిన సంగతి తెలిసిందే. అమెరికా క్యాపిటల్ హౌస్ ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్స్ ను బ్యాన్ చేశాయి. దీంతో అప్పటి నుంచి ట్రంప్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే ఆయనే సొంతంగా సోసల్ మీడియా యాప్ ను లాంచ్ చేయబోతున్నారు. 'ట్రూత్' పేరుతో సోషల్ మీడియా యాప్ ను ట్రంప్ రూపొందించాడు.ఇందులో ట్రెండింగ్ టాపిక్స్, ట్యాగింగ్ ఆప్షన్లు ఉన్నాయి.

ట్రూత్ యాప్ ను యూఎస్ ప్రెసిడెంట్ డే సందర్భంగా ఫిబ్రవరి 21న లాంచ్ చేయబోతున్నారు.

ట్విట్టర్, ఫేస్ బుక్ సంస్థలకు పోటీగా ట్రంప్ ఈ యాప్ ను లాంచ్ చేయబోతున్నారు. ట్రూత్ యాప్ ద్వారా తనను వ్యతిరేకించిన వారిపై బదులు తీర్చుకోబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధ్యక్షుడిగా పోటీచేసేందుకు ఈ యాప్ ట్రంప్ నకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.