Begin typing your search above and press return to search.

మోడీకి ట్రంప్ భ‌లే హ్యాండ్ ఇచ్చాడే

By:  Tupaki Desk   |   30 Sep 2017 4:19 PM GMT
మోడీకి ట్రంప్ భ‌లే హ్యాండ్ ఇచ్చాడే
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి - భార‌త్‌ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భ‌లే హ్యాండిచ్చారు. అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి ఎంపిక‌యిన త‌ర్వాత తొలిసారిగా ఆసియా ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న ట్రంప్...భార‌త్‌ కు త‌ప్ప ఉప‌ఖండంలోని మిగ‌తా ముఖ్య‌ - ద్వితీయ ప్రాధాన్య దేశాల‌ను సంద‌ర్శించేందుకు ఓకే చెప్పేశారు. పొరుగున ఉన్న చైనా స‌హా ఇటీవ‌లే భార‌త్‌ తో దోస్తీ క‌ట్టిన జపాన్ స‌హా దక్షిణ కొరియా, వియత్నాం - ఫిలిప్పీన్స్‌ - హవాయి దేశాల్లో ట్రంప్‌ పర్యటించబోతున్నారు. ఈ మేర‌కు వైట్‌ హౌజ్ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. అయితే ఈ జాబితాలో భార‌త్ పేరు లేదు. దీంతో...ట్రంప్ ఆసియాకు వ‌స్తే...ఆయ‌న ప‌ర్య‌టించే మొద‌టి దేశం భార‌త్ అయి ఉంటుంద‌ని ప‌లువురు వేసిన‌ అంచ‌నా విఫ‌లం అయింది. కానీ ఇప్పుడు భార‌త్ త‌ప్ప మ‌రే దేశం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

నవంబర్‌ 3 నుంచి నవంబర్‌ 14 వరకు ఈ పర్యటన సాగబోతున్నట్టు స‌మాచారం. అయితే భార‌త్ త‌ప్ప మిగ‌తా దేశాల్లో ప‌ర్య‌టించాల‌నే నిర్ణ‌యం ట్రంప్ ఎందుకు తీసుకున్నార‌నేది భార‌త వ‌ర్గాలు అంచ‌నా వేసే ప‌నిలో ప‌డ్డాయి. మ‌రోవైపు మ‌న దేశానికి రాక‌పోయిన‌ప్ప‌టికీ....మ‌న ప్ర‌ధాని మోడీతో మాత్రం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ భేటీ అవుతార‌ని తెలుస్తోంది. మనీలాలో జరుగబోయే ఆసియన్‌ సదస్సులో ఈ ఇద్ద‌రు నేత‌ల భేటీ జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే జూన్‌ లో వాషింగ్టన్‌ డీసీలో - జూలైలో జర్మనీలో జరిగిన జీ-20 సదస్సులో వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. త‌ద్వారా ఈ భేటీ జ‌రిగితే మూడో స‌మావేశం అవుతుంద‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విన‌తికి ట్రంప్ కూతురు ఇవాంక గ‌తంలోనే ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. భార‌త్‌ లో ప‌ర్య‌టించేందుకు ట్రంప్ కూతురును మోడీని ఆహ్వానించారు. ఇందులో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన పరిణామం...ఈ ప‌ర్య‌ట‌న తెలుగువారి రాజ‌ధాని హైదరాబాద్‌ కు తీపిక‌బురు. ఎందుకంటే ఇవాంక మొట్ట‌మొద‌టి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హైద‌రాబాద్‌ కు రానున్నారు. హైదరాబాద్‌ లో నవంబర్‌ లో జరుగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరయ్యేందుకు ట్రంప్ అనుమ‌తి మేర‌కు ఆమె కూతురు ఇవాంకాకు త‌న టూర్ విష‌యాన్ని వెల్ల‌డించారు.