Begin typing your search above and press return to search.

అంతలా ట్రై చేసినా డయానా దక్కలేదంట

By:  Tupaki Desk   |   18 Aug 2015 5:47 AM GMT
అంతలా ట్రై చేసినా డయానా దక్కలేదంట
X
బ్రిటీష్ రాణిగా.. మానవత్వానికి నిలువెత్తు రూపంగా.. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా కనిపించే ఆమెలో అందరికి కొట్టొచ్చినట్లు కనిపించే మతి పోగొట్టే అందమే. ఆమె అందానికి ఎందరో దాసులయ్యారు. ఆమె కనుచూపు పడితే చాలు తమ జన్మధన్యమవుతుందని ఫీలైన వారు తక్కువేం కాదు. ఇక.. ఆమెతో సానిహిత్యం సంబంధం కోసం మొనగాళ్లు లాంటి మగమగరాజులు ఉన్నారు. అలాంటి ఆమె ఒక కారు ప్రమాదంలో మరణించటం తెలిసిందే. తాజాగా ఆమెకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.

ప్రిన్స్ ఛార్లెస్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత డయానా ఒంటరిగా ఉండటం తెలిసిందే. ఈ సమయంలో ఆమె మనసు దోచుకునేందుకు అమెరికా వ్యాపార దిగ్గజం డోనాల్డ్ ట్రంప్ ఎంతగా ప్రయత్నించాడన్న విషయాన్ని తాజాగా డయానా స్నేహితురాలు.. టెలివిజన్ ప్రెజెంటర్ సెలీనా స్కాట్.. ఒక ప్రముఖ మీడియాలో కాలమ్ రాశారు.

భర్త నుంచి విడిపోయిన డయానాను సొంతం చేసుకోవాలని ఎంతోమంది అనుకున్నట్లే.. డయానా అభిమానాన్ని సంపాదించేందుకు డోనాల్డ్ విపరీతంగా ప్రయత్నించేవాడట. ఆమె మనసు దోచుకునేందుకు.. ఇంటికి నిత్యం ఖరీదైన బహుమతులు పంపేవాడట. బొకేలు.. బహుమతులు పంపటంతో పాటు.. తరచూ కలవానికి విపరీతంగా ప్రయత్నించేవాడని పేర్కొంది

ఒకదశలో డయానా డోనాల్డ్ గురించి ఆలోచించినట్లు సెలీనా పేర్కొంది. ఒకరోజు తనతో కలిసి డిన్నర్ చేసిన సమయంలో డొనాల్టో ప్రస్తావన తీసుకొచ్చి.. అతగాడు పంపుతున్న ఖరీదైన బహుమతుల గురించి ప్రస్తావిస్తూ.. ఏం చేయాలని డయానా తనను సలహా కోరిందని.. తాను వద్దని చెప్పినట్లుగా ఆమె పేర్కొంది.

అతగాడు పంపుతున్న బహుమతుల్ని చెత్తబుట్టలో వేయాలని డయానాకు తాను సూచించినట్లు పేర్కొంది. ఎందుకంటే.. డయానాను డొనాల్డ్ ఓ ఖరీదైన భార్యగా భావించేవాడని తెలిపింది. 1997లో డయానా తన రహస్య ప్రియుడితో కారు ప్రమాదంలో దుర్మరణం పాలు కావటం.. ఆ తర్వాత డొనాల్డో ఒక పుస్తకాన్ని రాశారు. అందులో డయానా గురించి ప్రస్తావిస్తూ.. తన జీవితంలో ఆడవాళ్లకు సంబంధించిన ఏదైనా అసంతృప్తి ఉందంటే.. అది డయానాతో డేట్ చేయలేకపోవటమేనని.. ఆమెతో రొమాన్స్ చేసే అవకాశం వస్తుందని భావించానని.. ఆమె గదిలో ఉంటే ఆ గదికే అందం వచ్చేదని రాసుకున్నాడు. అంతేకాదు.. ఆమె నిజంగానే ఒక రాకుమారని పేర్కొన్నాడు.