Begin typing your search above and press return to search.

ట్రంప్ ఇజ్ బ్యాక్ ... మొదలెట్టేశారు!

By:  Tupaki Desk   |   11 Nov 2016 12:46 PM GMT
ట్రంప్ ఇజ్ బ్యాక్ ... మొదలెట్టేశారు!
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో తన నోటికి ఫుల్ గా పనిచెప్పారు డొనాల్డ్ ట్రంప్. ఒక్కసారి తాను మాట్లాడటం - విమర్శించడం మొదలుపెడితే ప్రత్యర్ధి ఎవరనేది ఆలోచించేపనిలేదని, వెనకా ముందూ చూసే ఆలోచన కూడా లేదని చెబుతున్నట్లుగా చెలరేగిపోయే వారు. హిల్లరీ క్లింటన్ ని దెయ్యం అని కూడా విమర్శించారు ట్రంప్. ఈ క్రమంలో సర్వేలు - అంచనాలను తలకిందులు చేస్తూ ట్రంప్ గెలిచారు. త్వరలో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఎన్నికల్లో గెలిచిన అనంతరం ట్రంప్ స్పీచ్ చూసిన వారంతా... ట్రంప్ పూర్తిగా మారిపోయారు, ఎంత హుందాగా మాట్లాడారు.. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వేరు - అధ్యక్షుడైన ట్రంప్ వేరు అని అభినందనలతో ముంచెత్తారు. అయితే తాజాగా పాత ట్రంప్ బయటకొచ్చారు!!

తాజాగా ట్రంప్ గెలుపును నిరసిస్తూ కాలిఫోర్నియా - శాన్ ఫ్రాన్సిస్కో లతోపాటు తదితర ప్రాంతాల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పాత ట్రంప్ బయటకొచ్చారు. ఈ విషయాలపై స్పందించిన ట్రంప్... "చాలా నిష్ఫక్షపాతంగా - విజయవంతంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.. ఇప్పుడు ఆందోళన చేస్తున్నవారంతా డబ్బుతీసుకొని ఈ పనికి పూనుకున్నవారే.. వారంతా ప్రొఫెషనల్ ఆందోళనకారులు.. ఈ ఆందోళనల వెనుక కచ్చితంగా మీడియానే ఉంది" అంటూ అనర్గలంగా ఫైరయ్యారు.

ఇదే క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ప్రశంసల్లో ముంచెత్తారు ట్రంప్. నిజంగా తాను ఊహించిన దానికంటే గొప్ప అనుభవం అని ఒబామాకు కితాబిచ్చారు. తన భార్య మిలానియాకు ఒబామా భార్య మిషెల్లీ ఒబామా బాగా నచ్చారంటూ ట్వీట్ చేశారు. ట్రంప్ లో ఎన్ని యాంగిల్సో అంటూ ఆన్ లైన్ లో కామెంట్స్ మొదలైపోయాయి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/