Begin typing your search above and press return to search.

అణ్వాయుధాల‌పై ట్రంప్ షాక్ ట్వీట్‌

By:  Tupaki Desk   |   23 Dec 2016 8:17 AM GMT
అణ్వాయుధాల‌పై ట్రంప్ షాక్ ట్వీట్‌
X
అమెరికా కాబోయే అద్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త‌న‌దైన మార్క్ ట్వీట్ చేశారు. అణ్వాయుధాల సామ‌ర్థ్యంపై తాజాగా ట్రంప్ చేసిన ఆస‌క్తిక‌రమైన ట్వీట్ ప్ర‌కారం... అణ్వాయుధాల‌ను త‌గ్గించాల‌ని గ‌త దేశాధ్య‌క్షులు ప్ర‌య‌త్నాలు చేప‌ట్ట‌గా, ట్రంప్ మాత్రం దానికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. అణ్వాయుధ సామ‌ర్ధ్యాన్ని విస్త‌రించాల‌ని తాజాగా ట్రంప్ ట్వీట్ చేశారు. అణ్వాయుధాల‌పై ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ కామెంట్ చేసిన కొన్ని క్ష‌ణాల‌కే ట్రంప్ ట్వీట్ చేయ‌డం విశేషం. దీంతో ట్రంప్ ట్వీట్లపై అమెరికా పరిపాలనా యంత్రాంగం విప‌రీతంగా చ‌ర్చిస్తోంది.

తాజాగా మిలిట‌రీ అధికారుల‌తో స‌మావేశ‌మైన పుతిన్ అణ్వాయుధ సామ‌ర్థ్యాన్ని శ‌ర‌వేగంగా విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న డిఫెన్స్ వ్య‌వ‌స్థ‌ను చేధించుకుని వెళ్లే అణ్వాయుధ ద‌ళాల‌ను రూపొందించాల‌ని పుతిన్ త‌మ సైనిక అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. న్యూక్లియ‌ర్ రాకెట్ల‌ను షూట్ చేసే కొత్త వ్య‌వ‌స్థ‌ను డెవ‌ల‌ప్ చేయాల‌ని పెంట‌గాన్ వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో పుతిన్ ఆ ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే అణ్వాయుధ సామ‌ర్ధ్యాన్ని పెంచుకోవాల‌ని పుతిన్ వ్యాఖ్యానించిన కొన్ని గంట‌ల్లోనే ట్రంప్ దానికి కౌంట‌ర్ గా ట్వీట్ చేశారు. అణ్వాయుధ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్ట‌ప‌రిచి - దాన్ని విస్త‌రింప‌చేయాల‌ని ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే తాను ఎందుకు ఆ ట్వీట్ చేశార‌న్న విష‌యాన్ని విశ‌దీక‌రించ‌లేదు. ట్రంప్ చేస్తున్న ట్వీట్ల వ‌ల్ల అమెరికా విదేశాంగ విధానం అర్థం కావ‌డం లేద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/