Begin typing your search above and press return to search.
ట్రంప్ ట్విట్టర్ ఖాతా పని చేయలేదు
By: Tupaki Desk | 3 Nov 2017 7:16 AM GMTఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా పని చేయటం లేదన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిన ఈ ఉదంతాన్ని చూసిన పలువురు ట్రంప్ ట్విట్టర్ పేజీని చూస్తే మామూలుగానే పని చేయటం కనిపించింది. మరి.. సోషల్ మీడియాలో వైరల్ అయిన న్యూస్ తప్పా? ఈ మొత్తం గందరగోళానికి కారణమేంది? అన్న విషయంలోకి వెళితే..
ట్రంప్ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య 41.7 మిలియన్లు. ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు ఉంటే అతి కొద్ది ఖాతాల్లో ట్రంప్ ది కూడా ఒకటి. మరింతమంది ఫాలోవర్లు ఉన్న ఖాతాను ట్రంప్ వదులుకునే ప్రయత్నం చేశారా? అంటే లేదనే చెప్పాలి. కానీ.. ఒక ఉద్యోగి పొరపాటుతో ట్రంప్ ట్విట్టర్ ఖాతా దాదాపు 11 నిమిషాలపాటు ఆగిపోయింది. గురువారం సాయంత్రం ఇది చోటు చేసుకుంది. @realdonald trump అకౌంట్ కు మెసేజ్ చేస్తే.. ఈ ట్విట్టర్ పేజీ ఇప్పుడు పని చేయటం లేదన్న సమాధానం రావటంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
ట్విట్టర్ నుంచి ట్రంప్ వైదొలిగారా? అన్న సందేహం వచ్చింది.దీంతో గందరగోళం చోటు చేసుకుంది. అదే సమయంలో ట్విట్టర్‌కు ట్రంప్ గుడ్ బై చెప్పారన్న ప్రచారం మొదలైంది.
ఈ విషయాన్ని గుర్తించిన ట్విట్టర్ వెంటనే ..ట్రంప్ ఖాతాను చెక్ చేసింది. ఒక ఉద్యోగి తప్పిదం కారణంగానే ఈ గందరగోళం చోటు చేసుకుందన్న విషయాన్ని గుర్తించారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతా పని చేయకుండా పోయిన 11 నిమిషాల వ్యవధిలోనే పునరుద్ధరించారు. ట్రంప్ ఖాతాకు కలిగిన ఇబ్బందిపై విచారణ జరుపుతున్నట్లు ట్విట్టర్ పేర్కొంది.